NagaShaurya - వరుడిగా మారిన హీరో

Friday,January 22,2021 - 12:51 by Z_CLU

నాగశౌర్య-రీతూవర్మ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా వరుడు కావలెను. లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ప్రొడ్యూస్ చేస్తోంది.

ఈరోజు నాగశౌర్య పుట్టినరోజు సందర్భంగా, సినిమా నుంచి నాగశౌర్య లుక్ తో ఓ చిన్న వీడియో రిలీజ్ చేశారు. వీడియోలో నాగశౌర్య లవర్ బాయ్ లుక్ బాగుంది. విశాల్ చంద్ర శేఖర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది.

ఈ సందర్భంగా సినిమా రిలీజ్ పై కూడా చిన్నపాటి క్లారిటీ ఇచ్చారు. మే నెలలో థియేటర్లలోకి రానుంది వరుడు కావలెను సినిమా.

నాగశౌర్య, రీతువర్మ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో.. నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

మాటలు: గణేష్ రావూరి
ఛాయాగ్రహణం: వంశి పచ్చి పులుసు
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
ఎడిటర్: నవీన్ నూలి
ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్
సమర్పణ: పి.డి.వి.ప్రసాద్
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: లక్ష్మీసౌజన్య