దుబాయ్ లో ల్యాండ్ అయిన మహేష్

Friday,January 22,2021 - 01:01 by Z_CLU

సూపర్ స్టార్ మహేష్ బాబు దుబాయ్ లో ల్యాండ్ అయ్యాడు. సర్కారువారి పాట రెగ్యులర్ షూటింగ్ ఈనెల 25 నుంచి దుబాయ్ లో జరగనుంది. కానీ ఈ షెడ్యూల్ కు 4 రోజుల ముందే దుబాయ్ వెళ్లాడు మహేష్. దీనికి ఓ కారణం ఉంది.

ఈరోజు మహేష్ భార్య నమ్రత పుట్టినరోజు. ఆమె పుట్టినరోజును సెలబ్రేట్ చేసేందుకు కుటుంబంతో కలిసి దుబాయ్ వెళ్లాడు సూపర్ స్టార్. అలా ఈ 3 రోజులు ఫ్యామిలీతో గడిపి, ఆ తర్వాత సెట్స్ పైకి వెళ్తాడన్నమాట.

సర్కారువారి పాట ఫస్ట్ షెడ్యూల్, ఫస్ట్ డే నుంచి సెట్స్ పైకి రాబోతున్నాడు మహేష్. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించనుంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు.

Mahesh went to Dubai with family Mahesh went to Dubai with family Mahesh went to Dubai with family Mahesh went to Dubai with family