ZeeCinemalu - Jan 22

Thursday,January 21,2021 - 09:29 by Z_CLU

కుక్కలున్నాయి జాగ్రత్త
నటీనటులు : సిబిరాజ్, అరుంధతి
ఇతర నటీనటులు : ఇదో, బాలాజీ వేణుగోపాల్, మనోబాల, మయిల్ సామి, ప్రింజ్ నితిక్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : ధరన్ కుమార్
డైరెక్టర్ : శక్తి సౌందర్ రాజన్
ప్రొడ్యూసర్ : సత్యరాజ్, మహేశ్వరి సత్యరాజ్
రిలీజ్ డేట్ : 21 నవంబర్ 2014
సిబిరాజ్, అరుంధతి జంటగా నటించిన ఇమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ ‘కుక్కలున్నాయి జాగ్రత్త’. మోస్ట్ ఇంటెన్సివ్ యాక్షన్ థ్రిల్లర్ లో కుక్క కీ రోల్ ప్లే చేసింది. ఒక అమ్మాయి కిడ్నాప్ కేసును ఇన్వెస్టిగేట్ చేసే ప్రాసెస్ లో తన ఫ్రెండ్ ని కోల్పోతాడు పోలీసాఫీసర్ కార్తీక్. ఆ కిడ్నాపర్లను అంతం చేసే ప్రాసెస్ లో ఉన్న కార్తీక్ కి అనుకోకుండా మిలిటరీ ట్రైన్డ్ కుక్క స్నేహం ఏర్పడుతుంది. ఆ కుక్క పోలీసాఫీసర్ కార్తీక్ కి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో ఎలా సహాయపడింది..? అనేదే ఈ సినిమాలో మోస్ట్ థ్రిల్లింగ్ ఎలిమెంట్.

=========================

నవ వసంతం
నటీనటులు : తరుణ్, ప్రియమణి
ఇతర నటీనటులు : ఆకాష్,అంకిత, సునీల్, రోహిత్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు ,ఆహుతి ప్రసాద్, తెలంగాణ శకుంతల తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : ఎస్.ఏ.రాజ్ కుమార్
డైరెక్టర్ : కె.షాజహాన్
ప్రొడ్యూసర్ : ఆర్.బి.చౌదరి
రిలీజ్ డేట్ : 9 నవంబర్ 2007
తరుణ్, ప్రియమణి హీరో హీరోయిన్స్ గా దర్శకుడు షహజాహాన్ తెరకెక్కించిన ఫామిలీ ఎంటర్టైనర్ సినిమా ‘నవ వసంతం‘. అందమైన లవ్ స్టోరీ తో పాటు స్నేహితుల మధ్య అనుబంధాన్ని చాటి చెప్పే కథ తో సూపర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ సినిమా సూపర్ గుడ్ ఫిలిం గా అందరినీ ఆకట్టుకొని అలరిస్తుంది. తరుణ్ ప్రియమణి మధ్య వచ్చే లవ్ సీన్స్, తరుణ్, ఆకాష్, రోహిత్, సునీల్ మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్స్ తో పాటు ఎస్.ఏ. రాజ్ కుమార్ మ్యూజిక్ ఈ సినిమాకు హైలైట్స్…

===========================

సంతోషం
నటీనటులు – నాగార్జున, శ్రియ, ప్రభుదేవా, గ్రేసీసింగ్, సునీల్ తదితరులు
సంగీతం – ఆర్పీ పట్నాయక్
దర్శకత్వం – దశరథ్
బ్యానర్ – శ్రీ దుర్గా ఆర్ట్స్
నిర్మాత – కేఎల్ నారాయణ
రిలీజ్ – 2002, మే 9
నాగార్జున కెరీర్ లో సూపర్ హిట్ సినిమాల్లో ఒకటి సంతోషం. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా, కింగ్ నాగ్ ను ఫ్యామిలీ ఆడియన్స్ కు మరింత దగ్గర చేసింది. హార్ట్ టచింగ్ స్టోరీని దర్శకుడు దశరథ్, అంతే హార్ట్ టచింగ్ గా తెరకెక్కించాడు. హీరోయిన్ గ్రేసీ సింగ్ ఈ సినిమాతోనే టాలీవుడ్ కు పరిచయమైంది. ఇక మరో హీరోయిన్ శ్రియ, ఎప్పట్లానే తన క్యూట్ యాక్టింగ్ తో ఆకట్టుకుంది. ఈ సినిమాలో సాంగ్స్ అన్నీ సూపర్ హిట్. థీమ్ సాంగ్ తో కలిపి మళ్లీ మళ్లీ హమ్ చేసుకునేలా మొత్తం 8 ట్యూన్స్ ఇచ్చాడు ఆర్పీ పట్నాయక్.

==============================

పేపర్ బాయ్
నటీనటులు : సంతోష్ శోభన్, రియా సోమన్
ఇతర నటీనటులు : తాన్యా హోప్, పోసాని కృష్ణ మురళి, అన్నపూర్ణ, బిత్తిరి సత్తి, సన్నీ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : భీమ్స్
డైరెక్టర్ : V. జయశంకర్
ప్రొడ్యూసర్ : సంపత్ నంది, రాములు, వెంకట్, నరసింహ
రిలీజ్ డేట్ : 31 ఆగష్టు 2018
పేపర్ బాయ్ రవి, ధరణి ఇద్దరూ ప్రేమించుకుంటారు. అయితే ఎప్పుడైతే వీరి ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలుస్తుందో అక్కడి నుండే సమస్య మొదలవుతుంది. మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చిన రవితో ధరణి పెళ్లి చేయడానికి ఆమె కుటుంబ సభ్యులు అంత ఈజీగా ఒప్పుకోరు.. అప్పుడు రవి, ధరణి ఏం చేస్తారు..? తమ ప్రేమని ఎలా గెలిపించుకుంటారు. అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

==========================

ఉన్నది ఒకటే జిందగీ
నటీనటులు : రామ్ పోతినేని, అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి
ఇతర నటీనటులు : శ్రీ విష్ణు, ప్రియదర్శి, కిరీటి దామరాజు, హిమజ, అనీషా ఆంబ్రోస్ మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్
డైరెక్టర్ : కిషోర్ తిరుమల
ప్రొడ్యూసర్ : కృష్ణ చైతన్య, స్రవంతి రవి కిషోర్
రిలీజ్ డేట్ : 27 అక్టోబర్ 2017
అభి(రామ్) – వాసు(శ్రీ విష్ణు) ఒకరిని వదిలి ఒకరు ఉండలేని ప్రాణ స్నేహితులు. చిన్నతనం నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ గా జీవితాన్ని గడుపుతున్న అభి – వాసు జీవితంలోకి అనుకోకుండా మహా(అనుపమ) అనే అమ్మాయి ఎంటర్ అవుతుంది. స్నేహితుడు తర్వాతే ఇంకెవరైనా అనుకునే అభి- వాసులు మహా వల్ల నాలుగేళ్లు దూరమవుతారు. ఇంతకీ మహా ఎవరు…? ఒకరినొకరు వదిలి ఉండలేని అభి – వాసులు ఎందుకు విడిపోయారు.. చివరికి మళ్ళీ ఎలా కలిశారు..అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.