అక్టోబర్ లో ఓటీటీ, డబ్బింగ్ సినిమాలతో కలుపుకొని దాదాపు 27 మూవీస్ రిలీజ్ అయ్యాయి. కానీ వీటిలో కొన్ని సినిమాలు మాత్రమే హిట్టయ్యాయి. ఏ వారం ఎన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి, వాటిలో ఏ సినిమా క్లిక్ అయిందో చూద్దాం.

అక్టోబర్ 1న సాయిధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ మూవీతో పాటు ఇదే మా కథ, ఆట నాదే వేట నాదే అనే సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో రిపబ్లిక్ సినిమా డీసెంట్ హిట్ టాక్ అందుకుంది. మంచి సందేశాన్నిస్తూ, సమాజంలో ఉన్న సమస్యల్ని ఎత్తిచూపిన ఈ సినిమా అందరికీ నచ్చింది. ఈ మూవీతో పాటు అదే వారం వచ్చిన ఇదే మా కథ ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. ఆట నాదే వేట నాదే సినిమా ఫ్లాప్ అయింది.

ఆగస్ట్ రెండో వారంలో ‘కొండపొలం’, ‘ఆరడుగుల బుల్లెట్’, ‘డాక్టర్’ సినిమాలొచ్చాయి. వీటిలో క్రిష్-వైష్ణవ్ తేజ్ కాంబోలో వచ్చిన కొండపొలం సినిమా అందర్నీ ఆకర్షించింది. యూత్ లో మంచి స్ఫూర్తిని రగిల్చిన ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్, రకుల్ హీరోహీరోయిన్లుగా నటించారు. గోపీచంద్-నయనతార చేసిన ఆరడుగుల బుల్లెట్, నిరాశపరిచింది. డబ్బింగ్ మూవీగా వచ్చిన ‘వరుణ్ డాక్టర్’ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.

దసరా ఎట్రాక్షన్స్ గా మహాసముద్రం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, పెళ్లిసందD సినిమాలొచ్చాయి. వీటిలో మహాసముద్రం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాల్ని మహాసముద్రం అందుకోలేకపోయింది. శర్వానంద్-సిద్దార్థ్ హీరోలుగా అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎట్రాక్ట్ చేయలేకపోయింది. దీంతో దర్శకుడు సోషల్ మీడియాలో సారీ కూడా చెప్పాడు. ఇక అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కు మొదటి రోజు మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ, తర్వాత సినిమా ఊపందుకుంది. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణతో వచ్చిన ‘పెళ్లిసందD’ సినిమా బి, సి సెంటర్లలో బాగా ఆడింది.
అక్టోబర్ 22న ‘నాట్యం’, ‘మధుర వైన్స్’, ‘ప్యార్ హి ప్యార్’, ‘అసలేం జరిగింది’, ‘క్లిక్’ లాంటి సినిమాలు రిలీజయ్యాయి. వీటిలో ఏ ఒక్క సినిమా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. ఇదే వారం జీ-5లో హెడ్స్ అండ్ టేల్స్ అంటూ వచ్చిన ఒరిజినల్ మూవీ అందర్నీ ఆకట్టుకుంది.

అక్టోబర్ కు ఫినిషింగ్ టచ్ ఇస్తూ.. ‘వరుడు కావలెను’, ‘రొమాంటిక్’ సినిమాలొచ్చాయి. వీటిలో ‘రొమాంటిక్’ సినిమా నిరాశపరచగా.. ‘వరుడు కావలెను’ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఈ రెండు సినిమాలతో పాటు ‘మిషన్-2020’, ‘మైల్స్ ఆఫ్ లవ్’, ‘తమసోమా జ్యోతిర్గమయ’, ‘ఓ మధు’, ‘మిస్టర్ ప్రేమికుడు’, ‘ఫ్యామిలీ డ్రామా’ (సోనీ లివ్) సినిమాలు రాగా.. ఇవేవీ మెప్పించలేకపోయాయి. ఓవరాల్ గా అక్టోబర్ మాసంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, వరుడు కావలెను సినిమాలు మాత్రమే మెరిశాయి.
Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics