Nagashaurya Love: హీరో నాగశౌర్య ప్రేమ పెళ్లి

Thursday,November 10,2022 - 03:50 by Z_CLU

Hero Naga Shaurya to tie the knot on November 20

టాలీవుడ్ లో మరో హీరో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. హీరో నాగశౌర్య (Nagashaurya) ఓ ఇంటివాడు కాబోతున్నాడు. బెంగళూరుకు చెందిన అనూష అనే అమ్మాయిని కొన్నాళ్లుగా ప్రేమిస్తున్నాడు శౌర్య. ఇప్పుడు ఆమెను పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈనెల 20న నాగశౌర్య పెళ్లి (Nagashaurya Wedding) జరగనుంది. 19వ తేదీ నుంచే పెళ్లి సంబరం మొదలవుతుంది. బెంగళూరులోని JW మారియట్ హోటల్ లో ఈ పెళ్లి జరుగుతుంది.

నాగశౌర్య ప్రేమ-పెళ్లిపై (Nagashaurya love) ఈమధ్య పుకార్లు వచ్చినప్పటికీ వాటిని ఖండిస్తూ వచ్చాడు ఈహీరో. తన ప్రేమ-పెళ్లి వ్యవహారాన్ని సీక్రెట్ గా ఉంచాడు. ఇప్పుడు సరిగ్గా పెళ్లికి 10 రోజుల ముందు తన టీమ్ తో ఈ మేటర్ బయటకొచ్చేలా చేశాడు. అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

గతంలో నితిన్, కార్తికేయ కూడా ఇలానే చేశారు. చాన్నాళ్లుగా తమ గర్ల్ ఫ్రెండ్స్ తో ప్రేమలో ఉన్న ఈ హీరోలు, లవ్ మేటర్ ఎక్కడా లీక్ కాకుండా జాగ్రత్తపడ్డారు. సరిగ్గా పెళ్లికి కొన్ని రోజుల ముందు విషయం బయటపెట్టారు. ఇప్పుడు నాగశౌర్య కూడా అదే రూటు ఫాలో అయ్యాడు.

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు శౌర్య. కృష్ణ వ్రింద విహారి సినిమాను థియేటర్లలోకి తీసుకొచ్చిన ఈ హీరో, వైష్ణవి ఫిలిమ్స్ బ్యానర్ పై అరుణాచలం దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇవి కాకుండా చేతిలో ఇంకా ప్రకటించని సినిమాలు మరో 2 ఉన్నాయి.