కిర్రాక్ పార్టీ హీరోయిన్స్ సిమ్రాన్ - సంయుక్త చిట్ చాట్

Thursday,March 15,2018 - 05:04 by Z_CLU

మార్చి 16 న రిలీజ్ కి రెడీ అవుతుంది నిఖిల్ కిర్రాక్ పార్టీ. అల్టిమేట్ యూత్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో సిమ్రాన్, సంయుక్త హెగ్డే హీరోయిన్ గా నటించారు. ఈ సందర్భంగా సినిమాలోని తమ క్యారెక్టర్స్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. అవి మీ కోసం…    

      

                                           

సిమ్రాన్ – అదే నా క్యారెక్టర్

సినిమాలో నా క్యారెక్టర్ చాలా సైలెంట్ గా ఉంటుంది. ఎప్పుడూ సొసైటీ కోసం ఏదో చేయాలని ఆరాటం ఉంటుంది. సినిమాలో నేను ప్లే చేసే రోల్, తక్కిన యాక్టర్స్ కన్నా సీనియర్. బేసిగ్గా గుడ్ లుకింగ్ కాబట్టి అందరూ తన చుట్టూ తిరుగుతూ ఉంటారు.

 

అలా ఉండదు…

కిర్రిక్ పార్టీ తో కంపేర్ చేస్తే ఈ సినిమాలో నా క్యారెక్టర్ అంత సీరియస్ గా ఉండదు. కొంచెం రిజర్వ్డ్ గా ఉండే క్యారెక్టర్.

రష్మిక లా ఉండదు…

కన్నడలో రష్మిక చాలా బాగా పర్ఫామ్ చేసింది. కానీ తెలుగులోకి వచ్చేసరికి ఫిల్మ్ మేకర్స్ కూడా నా క్యారెక్టర్ ని డిఫెరెంట్ గా ప్రెజెంట్ చేశారు. కిర్రాక్ పార్టీలో మీరు డిఫెరెంట్ మీరాను చూస్తారు.

 

 

నిఖిల్ తో వర్క్ చేయడం…

నిఖిల్ చాలా జోవియల్ గా ఉంటాడు. సినిమాలో తన క్యారెక్టర్ లో కంప్లీట్ గా ఇన్వాల్వ్ అయిపోతాడు. మరీ ముఖ్యంగా తనకు ఇన్ని సినిమాల్లోనటించిన ఎక్స్ పీరియన్స్ ఉందన్న ఫీలింగ్ లేకుండా చాలా ఈజీగా కలిసిపోతాడు.

 

సంయుక్త హెగ్డే – సినిమాలో నా క్యారెక్టర్ 

ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు సత్య. ఒక రకంగా చెప్పాలంటే సినిమాలో రియల్ లైఫ్ క్యారెక్టర్ ప్లే చేశాను. ఈ సినిమాలో హీరో కృష్ణ ని లవ్ చేస్తుంటాను. ఈ సినిమాలో ఇంటర్నల్ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ కూడా ఉంటుంది.

అలా జరిగింది…

నిజానికి ‘కిరాక్ పార్టీ’ కోసం నన్నడిగినప్పుడు ‘నో’ అని చెప్పేశాను. ఎందుకంటే ఆ క్యారెక్టర్ ని మళ్ళీ ప్లే చేయడమంటే సాహసమే. మళ్ళీ అదే రేంజ్ మ్యాజిక్ ని రిపీటెడ్ గా జెనెరేట్ చేయలేననిపించింది. కానీ ఎప్పుడైతే ఫిల్మ్ మేకర్స్ ఆ క్యారెక్టర్ లో నన్ను రీప్లేస్ చేయలేకపోతున్నామని మళ్ళీ అప్రోచ్ అయ్యారో, ఇక నో అని చెప్పలేకపోయాను. వాళ్ళు నన్ను అంతలా నమ్మడం నా అదృష్టం.

నేటివిటీని బట్టి చేంజెస్ చేశారు…

కన్నడలో నా క్యారెక్టర్ కి తెలుగులో నేటివిటీని బట్టి చిన్న చేంజెస్ చేశారు. కన్నడలో నా క్యారెక్టర్ చాలా బబ్లీగా కిడ్డిష్ గా ఉంటుంది. కానీ తెలుగులో వచ్చేసరికి ఇంకొంచెం గ్లామరస్ గా మార్చారు. కన్నడలో కన్నా ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఇంకొంచెం మెచ్యూర్డ్ గా ఉంటుంది.

 

కంప్లీట్ గా అపోజిట్…

నేను సినిమాల్లోకి రాకముందు అంతలా మేకప్ ఇష్టం ఉండదు. ఒకచోట సరిగ్గా కూర్చోవడం లాంటివి అసలు అలవాటు లేవు. కానీ సడెన్ గా కిర్రిక్ పార్టీ విషయంలో కంప్లీట్ గా కొత్తగా అనిపించేది. మేకప్ వేసుకోవడం, మన షాట్ టైమ్ వచ్చే వరకు వెయిట్ చేయడం అంతా కొత్తగా అనిపించేది. కానీ కిర్రాక్ పార్టీ వచ్చేసరికి ఇవన్నీ కొద్దిగా అలవాటయ్యాయి.

నా డబ్బింగ్ నేనే…

ఈ సినిమాలో నా డబ్బింగ్ నేనే చెప్పుకున్నా… నాకెందుకో మన వాయిస్ ఉంటేనే పర్ఫామెన్స్ కరెక్ట్ గా ఎలివేట్ అవుతుందని నా ఫీలింగ్… అందుకే నా డబ్బింగ్ నేనే చెప్పుకున్నా…