కళ్యాణ్ రామ్ MLA మూవీ ఆడియో రివ్యూ

Thursday,March 15,2018 - 07:02 by Z_CLU

మార్చి 23న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది కళ్యాణ్ రామ్ MLA. ఇప్పటికే రిలీజైన 2 పాటలు మణిశర్మ మార్క్ ఎసెన్స్ ని పర్ఫెక్ట్ గా ఎలివేట్ చేశాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ ప్రమోషన్ స్పీడ్ పెంచిన సినిమా యూనిట్, ఈ రోజు టోటల్ సాంగ్స్ ను జ్యూక్ బాక్స్ రూపంలో రిలీజ్ చేసింది.

 

గర్ల్ ఫ్రెండ్ : సినిమాలోని రొమాంటిక్ యాంగిల్ ని ఎలివేట్ చేస్తున్న సాంగ్. అనురాగ్ కులకర్ణి పాడిన ఈ పాట హీరో పాయింట్ ఆఫ్ వ్యూ లో ట్రెండీగా ఉండి యూత్ ని ఇంప్రెస్ చేస్తుంది. ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు.

మోస్ట్ వాంటెడ్ అబ్బాయి :  MLA సినిమా నుండి రిలీజైన ఫస్ట్ సింగిల్ ఇదే. ఈ సాంగ్ రిలీజ్ అయినప్పటి నుండే సినిమాపై ఇంట్రెస్టింగ్ వైబ్స్ క్రియేట్ చేసింది. సినిమాలో హీరో హీరోయిన్స్ కెమిస్ట్రీని ఎలివేట్ చేస్తున్న ఈ పాటని యాజిన్ నిజార్, రమ్య బెహరా కలిసి పాడారు. రామ జోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు.

 

యుద్ధం యుద్ధం : డెఫ్ఫినేట్ గా సినిమా సెకండాఫ్ లో ఒక పర్టికులర్ రివొల్యూషన్ ప్రాసెస్ లో ఉండే సాంగ్ అని తెలుస్తుంది. ఆవేశాన్ని ఎలివేట్ చేస్తున్న ఈ సాంగ్ లిరిక్స్ ని బట్టి సినిమా యాక్షన్ మోడ్ లో ఉన్నప్పుడు ఉండబోతుందని తెలుస్తుంది. అనురాగ్ కులకర్ణి పాడిన ఈ పాటకు రామ జోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు.

హేయ్ ఇందు : సినిమాలో మోస్ట్ ఎనర్జిటిక్ సాంగ్. రాహుల్ సిప్లిగంజ్ పాడిన ఈ సాంగ్ రిలీజైన రోజే అటు క్లాస్, ఇటు మాస్ అని తేడా లేకుండా అతి తక్కువ టైమ్ లో మ్యూజిక్ లవర్స్ ని రీచ్ అయింది. ఈ పాటకి కాసర్ల శ్యామ్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.

ఓవరాల్ గా కళ్యాణ్ రామ్ MLA సినిమాలో 4 పాటలు కూడా సిచ్యువేషనల్ గా ఉండి,  ఏ పాటకి ఆ పాటే స్పెషల్ అనిపిస్తున్నాయి.