వక్కంతం వంశీ ఇంటర్వ్యూ

Tuesday,May 08,2018 - 01:32 by Z_CLU

వక్కంతం వంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘నా పేరు సూర్య’ రిలీజైన ప్రతి సెంటర్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. అల్లు అర్జున్ ని డిఫెరెంట్ డైమెన్షన్ లో ప్రెజెంట్ చేస్తున్న ఈ సినిమాతో డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అయిన వక్కంతం వంశీ ఈ సినిమా కోసం పడ్డ శ్రమ దగ్గరినుండి, రిలీజ్ తరవాత సినిమాకు వస్తున్న రెస్పాన్స్ వరకు చాలా విషయాలు మీడియాతో డిస్కస్ చేశాడు అవి మీకోసం…

చాలా హ్యాప్పీగా ఉంది…

సినిమాకు వస్తున్న రెస్పాన్స్, కలెక్షన్స్ చాలా బావున్నాయి.. చాలా హ్యాప్పీ…

టాక్ మారింది…

సినిమాను చాలా మంది ఆర్మీ బేస్డ్ అనుకున్నారు. ఎగ్జాక్ట్ సినిమా ఏంటనేది జనరల్ ఆడియెన్స్ కి అర్థమవ్వడానికి 2 షోస్ టైమ్ పట్టింది. ఎప్పుడైతే జనరల్ ఆడియెన్స్ సినిమాకి రావడం మొదలుపెట్టారో, చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది.

కథ అలా బిగిన్ అయింది…

బేసిగ్గా రైటర్ నే కాబట్టి ఎప్పుడైనా ఏదైనా ఐడియా  వస్తే రాసి పెట్టుకుంటూ ఉంటా… ఎప్పుడైతే అల్లు అర్జున్ తో సినిమా అనుకున్నానో, ఆయనైతే ఫిట్ నెస్ విషయంలో శ్రద్ధగా ఉంటాడు, డిఫెరెంట్ మేకోవర్ కి కూడా కో ఆపరేట్ చేస్తాడు.. అందుకే ఈ కథ చెప్పాను…

నేను చెప్పాలనుకున్నది ఇది…

ఒక వ్యక్తికి ఒక డ్రీమ్ ఉంది. ఆ డ్రీమ్ ని అచీవ్ చేసే ప్రాసెస్ లో తన బలహీనత అడ్డు పడుతుంది. అప్పుడు తనేం చేశాడు..? తన డ్రీమ్ కోసం క్యారెక్టర్ ని చంపుకోవాలా..? అనేది నేను చెప్పదలుచుకున్న మెయిన్ పాయింట్. మిలిటరీ బ్యాక్ డ్రాప్ ఈ పాయింట్ తరవాత ఫిక్స్ చేసుకున్నా…

చాలా పోగొట్టుకున్నా…

నా కోపం వల్ల నేను చాలా పోగొట్టుకున్నా.. ఎవరైనా అంతే.. ఎవరి కోపం వల్ల వాళ్ళే నష్టపోతారు… తన కోపమే తన శత్రువు అని అందుకే అంటారు…

నేను ప్లాన్ చేసుకున్నది కాదు…

అందరూ నా కథల్లో ఫాదర్ సెంటిమెంట్ కంపల్సరీగా ఉంటుందని అంటుంటారు. నిజానికి నేనలా ప్లాన్ చేసుకోను… జరిగిపోతుంటుంది…

ప్రతి ఒక్కరిలో ఉంటుంది…

బన్ని కూడా చాలా రోజులుగా ఇలాంటి క్యారెక్టర్ దొరికితే చేద్దామని చాలా రోజులుగా అనుకుంటున్నాడు. ఆ టైమ్ లో నేను ఆయనకు ఈ కథ చెప్పడంతో ఆయనకు నచ్చేసింది.

ఆ సాంగ్ పట్టుబట్టి చేశా..

‘నా పేరు సూర్య’ కంప్లీట్ గా కమర్షియల్ సినిమా… సినిమాలో ఎంత దేశం గురించి మాట్లాడినా, మాస్ సాంగ్ ఉండాలని పట్టు బట్టి మరీ ‘ఇరగ ఇరగ’ సాంగ్ ప్లాన్ చేశా…

ఎవరూ చెప్పలేకపోతున్నారు…

‘నా పేరు సూర్య’ సినిమాకి లెంత్ అసలు ఇష్యూ కాదు… ఒకరిద్దరికీ లెంత్ ఎక్కువైందనిపించినా ఎక్కడ ఎక్కువైంది ఎగ్జాక్ట్ గా చెప్పలేకపోతున్నారు… సినిమా ఒక మూడ్ లో మూవ్ అవుతున్నప్పుడు లెంత్ ఎప్పుడూ ప్రాబ్లమ్ కాదు…

అదే బెస్ట్ కాంప్లిమెంట్…

త్రివిక్రమ్ గారికి సినిమా చాలా నచ్చింది. ఆయన అన్న మాటలు మీతో చెప్పుకున్నా నన్ను నేనే పొగిడినట్టు ఉంటుంది. ఆయనకు సినిమా నచ్చడం నాకు బెస్ట్ కాంప్లిమెంట్ అనిపించింది. సుకుమార్ U.S. లో చూశాడు సినిమాను. ఫోన్ చేసి చాలా ఇమోషనల్ గా మెసేజ్ పెట్టాడు…

రచయితలు డైరెక్టర్స్ గా…

రచయితలు డైరెక్టర్స్ గా ట్రాన్స్ ఫామ్ అవ్వడం బెటర్ అనే నా ఫీలింగ్. చాలా విషయాలు రైటర్స్, డైరెక్టర్స్ కి ఎగ్జాక్ట్ గా కన్వే చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ ‘నా పేరు సూర్య’ సినిమాలో హీరో క్యారెక్టర్ కి, మిర్రర్ కి మధ్య ఉండే సీన్స్, మరో డైరెక్టర్ కి చెప్పాల్సి వచ్చినప్పుడు సరిగ్గా కన్వే చేయలేకపోవచ్చు, వాళ్ళకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు… అందుకే రైటర్స్ డైరెక్టర్స్ అయితే వాళ్ళే మనుకుంటున్నారో దాన్ని సరిగ్గా ప్రెజెంట్ చేసే అవకాశం ఉంటుంది…

అందుకే అర్జున్…

సినిమాలో బన్ని కి ఫాదర్ రోల్ అనగానే 3 యాంగిల్స్ లో ఆలోచించాను. ఫిట్ నెస్ ఉండాలి… యంగ్ గా ఉండాలి… ప్రొఫెసర్ అనగానే ఆ లుక్ ఫ్రెష్ నెస్ కనిపించాలి. ఎప్పుడైతే నేను అర్జున్ గారిని ఆ ప్లేస్ లో ఇమాజిన్ చేసుకున్నానో చాలా బాగా అనిపించింది.

అది అరవింద్ గారి స్టేట్ మెంట్…

నా కొడుకు తలెత్తుకుని గర్వంగా తిరిగే సినిమా చేశావు అన్నారు అల్లు అరవింద్ గారు…

ఇక మిలిటరీ ఫీలింగ్…

మిలిటరీ స్పెషల్ షో తరవాత ‘మా జీవితాల్లోకి తొంగి చూసే సినిమా ఇప్పటి వరకు తగల్లేదండీ’ అన్నారు.