బన్నీ డైరెక్టర్ తో వరుణ్ సినిమా ?

Sunday,December 01,2019 - 04:28 by Z_CLU

లేటెస్ట్ గా ‘గద్దల కొండ గణేష్’ తో సూపర్ హిట్ అందుకున్న వరుణ్ తేజ్ నెక్స్ట్ కిరణ్ కుమార్ డైరెక్షన్ లో బాక్సింగ్ నేపథ్యంలో సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో సెట్స్ పైకి రానుంది. ఈ సినిమా తర్వాత వక్కంతం వంశీ తో సినిమా కమిట్ అయ్యాడట వరుణ్.

రచయితగా సూపర్ హిట్ సినిమాలకు వర్క్ చేసిన వక్కంతం బన్నీ ‘నా పేరు సూర్య’ తో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఇప్పుడు వరుణ్ తో రెండో సినిమాను చేయబోతున్నాడట. ప్రస్తుతం వరుణ్, వక్కంతం వంశీ కన్ఫర్మ్ అనే వార్త చక్కర్లు కొడుతుంది. మరి ఈ వార్తలో నిజమెంతో మరికొద్ది రోజులు తెలియనుంది.