Nithin Vakkantham Movie - హీరోయిన్ ఫిక్స్?

Friday,March 18,2022 - 04:06 by Z_CLU

Heroine locked for Nithin, Vakkantham Vamsi Movie

ప్రస్తుతం ఎడిటర్ ఎస్.ఆర్. శేఖర్ దర్శకత్వంలో నితిన్ ‘మాచర్ల నియోజిక వర్గం’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత వక్కంతం వంశీ దర్శకతంలో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నితిన్. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘నా పేరు సూర్య’ తో దర్శకుడిగా పరిచయమైన రైటర్ వక్కంతం కొంత గ్యాప్ తీసుకొని మళ్ళీ మెగా ఫోన్ పడుతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమాకి కాస్టింగ్ ఫైనల్ చేసే పనిలో ఉన్నారట. తాజాగా నితిన్ సరసన శ్రీలీల ని హీరోయిన్ ఫిక్స్ చేశారనే టాక్ వినబడుతుంది.

Pelli SandaD heroine sree leela

పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన శ్రీ లీల ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్. ఇప్పటికే ఆమె చేతిలో నాలుగైదు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ప్రస్తుతం రవితేజతో ఆమె రెండో సినిమా చేస్తుంది. ఇటివలే కన్నడ , తెలుగు బైలింగ్వెల్ ప్రాజెక్ట్ కూడా సైన్ చేసింది. ఇంకా తెలుగులో రెండు ప్రాజెక్ట్స్ సైన్ చేసిందని అంటున్నారు. అందులో నితిన్ సినిమా ఒకటి తెలుస్తుంది. త్వరలోనే ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు బయటికి రాలేదు కానీ మేకర్స్ త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. ‘మాచర్ల నియోజిక వర్గం’ షూటింగ్ ని ఫినిషింగ్ స్టేజికి తీసుకొచ్చిన నితిన్ ఆ సినిమా పూర్తవ్వగానే వక్కంతం సినిమాను మొదలు పెట్టనున్నాడు.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics