నా నువ్వే సినిమా నాకోసం అనుకోలేదు

Tuesday,May 08,2018 - 12:31 by Z_CLU

హీరో కల్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ నా నువ్వే. విడుదలకు సిద్ధమైన ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ మేటర్ ను మీడియాతో పంచుకున్నాడు ఈ నందమూరి హీరో. అసలు ఈ సినిమా తనకోసం అనుకోలేదని అంటున్నాడు.

“ఓసారి మహేష్ (సినిమా ప్రజెంటర్) నా దగ్గరకొచ్చాడు. జయేంద్ర గారు ఓ కథ చెబుతారంట అన్నాడు. అతను గతంలో తీసిన 180 సినిమా నేను చూశాను. అతడన్నీ లవ్ స్టోరీసే తీస్తాడు కదా. నాతో లవ్ స్టోరీ ఏంటని అనుకున్నాను. మొత్తమ్మీద కథ చెప్పారు. చాలా బాగా నచ్చింది. నన్నే ఎందుకు సెలక్ట్ చేసుకున్నారని అడిగాను. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలే చేస్తున్నారు. కొత్తగా చూపించడానికి ట్రై చేస్తానన్నారు.”

అలా నా నువ్వే సినిమా సాకారమైందంటున్నాడు కల్యాణ్ రామ్. సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ తో పనిచేయడం ఓ కలగానే మిగిలిపోతుందనుకున్నానని, కానీ జయేంద్ర చొరవతో తన కల నిజమైందంటున్నాడు కల్యాణ్ రామ్. తమన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఈ నెలలోనే థియేటర్లలోకి రానుంది.