నా పేరు సూర్య మూవీ 4 రోజుల వసూళ్లు

Tuesday,May 08,2018 - 02:58 by Z_CLU

స్టయిలిష్ స్టార్ బన్నీ నటించిన నా పేరు సూర్య సినిమా రికార్డు వసూళ్లతో దూసుకుపోతోంది. విడుదలైన 3 రోజులకే ప్రపంచవ్యాప్తంగా 85 కోట్ల 32 లక్షల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా.. వర్కింగ్ డే అయిన సోమవారం కూడా తన సత్తా చాటింది. అందరి అంచనాల్ని పటాపంచలు చేస్తూ.. సోమవారం కూడా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఏకంగా 2 కోట్ల 80 లక్షల రూపాయల షేర్ సాధించింది.

ఏపీ, నైజాం 4 రోజుల షేర్

నైజాం – రూ. 9.92 కోట్లు
సీడెడ్ – రూ. 4.65 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 3.90 కోట్లు
ఈస్ట్ – రూ. 2.92 కోట్లు
వెస్ట్ – రూ. 2.20 కోట్లు
గుంటూరు – రూ.3.43 కోట్లు
కృష్ణా – రూ. 2.06 కోట్లు
నెల్లూరు – రూ. 1.18 కోట్లు