టాప్ ట్రెండింగ్ లో వకీల్ సాబ్

Friday,January 15,2021 - 04:24 by Z_CLU

థియేటర్లలోకి 4 సినిమాలొచ్చాయి. కానీ అవేవీ నంబర్ వన్ ట్రెండింగ్ లో లేవు. దానికి కారణం వకీల్ సాబ్. అవును.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ మూవీ టీజర్ టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. సంక్రాంతి కానుకగా విడుదల చేసిన ఈ మూవీ టీజర్.. యూట్యూబ్ లో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది.

ఇప్పటికే 7 మిలియన్లకు పైగా వ్యూస్, 7 లక్షలకు పైగా లైక్స్ తో పవన్ కెరీర్ లోనే హయ్యస్ట్ గా నిలిచింది వకీల్ సాబ్ టీజర్. పవన్ రీఎంట్రీ మూవీ కోసం ఆడియన్స్ ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో చెప్పడానికి పెర్ ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా నిలిచింది వకీల్ సాబ్ టీజర్.

పవన్ కల్యాణ్-శృతిహాసన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా రీసెంట్ గా షూటింగ్ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. అనన్య, అంజలి, నివేత థామస్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాను త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు.

Click Here for Vakeel SaabTeaser