అల్లుడు అదుర్స్ ఫస్ట్ డే కలెక్షన్

Friday,January 15,2021 - 04:19 by Z_CLU

బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా నటించిన అల్లుడు అదుర్స్ మూవీ సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మొదటి రోజు డీసెంట్ కలెక్షన్స్ వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల 77 లక్షల రూపాయల షేర్ రాబట్టింది అల్లుడు అదుర్స్ మూవీ.

పక్కా కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ సినిమాకు నెగెటివ్ రెస్పాన్స్ వచ్చింది. బెల్లంకొండ కామెడీ టైమింగ్ పక్కనపెడితే.. నభా నటేష్, అను ఎమ్మాన్యుయేల్ గ్లామర్ డోస్ కూడా సినిమాను కాపాడలేకపోయింది.

ఏపీ,నైజాం ఫస్ట్ డే షేర్
నైజాం – 1.14 కోట్లు
సీడెడ్ – 61 లక్షలు
ఉత్తరాంధ్ర – 40 లక్షలు
ఈస్ట్ – 10 లక్షలు
వెస్ట్ – 21 లక్షలు
గుంటూరు – 17.2 లక్షలు
కృష్ణా – 7 లక్షలు
నెల్లూరు – 6 లక్షలు