పవన్ తో మరోసారి త్రివిక్రమ్

Sunday,January 17,2021 - 02:29 by Z_CLU

తను డైరెక్ట్ చేసిన సినిమాలు కాకుండా త్రివిక్రమ్ రైటింగ్ చేసిన సినిమాలు రెండే రెండు. అందులో ఒకటి మెగాస్టార్ నటించిన ‘జై చిరంజీవ’ కాగా మరొకటి పవర్ స్టార్ నటించిన ‘తీన్ మార్’. అయితే ఇప్పుడీ రెండు కాకుండా మరో సినిమా కోసం తన రైటింగ్ టాలెంట్ ను వాడబోతున్నాడు మాటల మాంత్రికుడు. పవన్ కళ్యాణ్ -రానా కాంబినేషన్ లో వస్తున్న Ayyappanum Koshiyum రీమేక్ కు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లేతో పాటు డైలాగ్స్ అందించబోతున్నాడు. ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించి త్రివిక్రమ్ కి వెల్కం చెప్పారు మేకర్స్.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు సాగర్ కే.చంద్ర దర్శకుడు. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళబోతుంది. మరి తీన్ మార్ తర్వాత మళ్ళీ పవన్ సినిమాకు రచయితగా పని చేస్తున్న త్రివిక్రమ్ ఈ రీమేక్ ను తన రైటింగ్ తో ఎలా తీర్చిదిద్దుతాడో చూడాలి.