త్రివిక్రమ్ సీనియర్ హీరోయిన్స్

Thursday,July 25,2019 - 10:02 by Z_CLU

అల్లు అర్జున్ కి తల్లిగా నటిస్తుంది టాబూ. దర్శకుడు త్రివిక్రమ్ కూడా టాబూ కోసం ఎప్పటిలాగే గుర్తుండిపోయే స్థాయి క్యారెక్టర్ రాసుకున్నాడు. నిన్నటి నుండే ఈ సినిమా సెట్స్ పైకి వచ్చేసిందీ టాబూ… దాంతో త్రివిక్రమ్ సీనియర్ హీరోయిన్స్ లిస్టు లోకి చేరిపోయిందీ సీనియర్ హీరోయిన్.

 

సుప్రియా పాఠక్ : తెలుగు ఆడియెన్స్ కి పెద్దగా పరిచయం లేకపోయినా, ‘అరవింద సమేత’ తో అందరికీ క్లోజ్ అయ్యేలా చేశాడు త్రివిక్రమ్. సినిమాలో పెద్దగా నిడివి ఉందనిపించకపోయినా, ఉన్న స్పేస్ లోనే సినిమా కథ ఇమిడేలా ప్లాన్ చేసుకున్నాడు. సినిమాలో హీరో క్యారెక్టర్ యుద్ధం రాకుండా ఆపే వ్యక్తిలా ట్రాన్స్ ఫామ్ అవ్వడానికి రీజన్ ఈ క్యారెక్టరే…

ఖుష్బూ : పవన్ కళ్యాణ్ కి పిన్నిలా నటించింది ‘అజ్ఞాతవాసి’. సినిమా మరీ అనుకున్నత సక్సెస్ రేంజ్ అందుకోకపోయినా, ఖుష్బూ తన పర్ఫామెన్స్ తో మరింతగా దగ్గరయింది.

నదియా : ‘అత్తారింటికి దారేది’ లో ఫస్ట్ టైమ్ త్రివిక్రమ్ లో నటించింది నదియా… పవన్ కళ్యాణ్ కి అత్తలా నటించి, ఇంప్రెసివ్ సీనియర్ హీరోయిన్ అనిపించుకుంది. దాంతో మరోసారి ‘అ..ఆ..’ సినిమాలో అవకాశం ఇచ్చి నితిన్ కి కూడా అత్తే అనిపించాడు ఈ క్రియేటివ్ డైరెక్టర్.