ఫిలిమ్ సిటీలో 'పుష్ప 2' ఘాట్

Tuesday,August 22,2023 - 03:20 by Z_CLU

అల్లు అర్జున్ , సుకుమార్ కాంబినేషన్ లో ‘పుష్ప’ కి కొనసాగింపుగా వస్తున్న ‘పుష్ప 2’ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం రామోజీ ఫిలిమ్ సిటీలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో అల్లు అర్జున్ , రష్మిక లపై కీలక సన్నివేశాలు తీస్తున్నారు. నెలాఖరు వరకూ అక్కడే షూటింగ్ జరుపుకోనుంది. అలాగే నెక్స్ట్ షెడ్యూల్ కోసం లొకేషన్స్ ఫైనల్ చేసే పనిలో ఉన్నారు.

భారీ అంచనాల ఉన్న ‘పుష్ప ది రూల్’ ను వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు.  మైత్రి మూవీ మేకర్స్ పై నవీన్ యర్నేని , రవి శంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.