టాలీవుడ్ స్టార్స్ న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్

Monday,December 31,2018 - 03:49 by Z_CLU

2019 కి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పడానికి ఆల్రెడీ ఫేవరేట్ లొకేషన్స్ ఫిక్స్ చేసుకున్నారు టాలీవుడ్ స్టార్స్. కొందరు ఇండియాలోనే ఫ్రెండ్స్ తో కలిసి హంగామా చేయడానికి స్కెచ్ వేసుకుంటే, మరికొంతమంది భారీ స్థాయిలో విదేశాల్లో న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ప్లాన్ చేసుకున్నారు.

https://www.instagram.com/p/BsAe0t4nXUk/

 

అల్లు అర్జున్ బీరట్, లెబనాన్ లో కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పనున్నాడు. రీసెంట్ గా ఇంస్టాగ్రామ్ లో ఈ స్టేటస్ అప్ డేట్ చేశాడు స్టైలిష్ స్టార్.

https://www.instagram.com/p/BsCerwOlK7a/

సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ప్రస్తుతం దుబాయ్ లోనే ఉన్నాడు. సోషల్ మీడియాలో చూస్తుంటే న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ అప్పుడే బిగిన్ అయిపోయినట్టనిపిస్తుంది.

https://twitter.com/RaashiKhanna/status/1078877237951295488

రాశిఖన్నా ఈ న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ని గ్రాండ్ గా ప్లాన్ చేసుకుంది. ఇప్పటికే దుబాయ్ కి చేరుకున్న ఈ ముద్దుగుమ్మ, తన స్టైల్ లో న్యూ ఇయర్ ని ఇన్వైట్ చేయనుంది.

https://www.instagram.com/p/BsAQayfF8x9/

ఇక కేథరిన్ థెరిసా కూడా ఆల్రెడీ సౌత్ ఆఫ్రికా లోనే ఉంది. ఇప్పటికే సెలేబ్రేషన్ మోడ్ లో ఉన్న కేథరిన్ సోషల్ మీడియాలో హంగామా చేస్తుంది.

https://twitter.com/hegdepooja/status/1079615521337864192

ఇక పూజాహెగ్డే కంప్లీట్ గా మస్తీ మూడ్ లో ఉంది. ఇప్పటికే న్యూయార్క్ లో పార్టీ టైమ్ బిగిన్ చేసిన ఈ స్టార్ హీరోయిన్, 2019 ని మరింత స్టైల్ గా సెలెబ్రేట్ చేసుకోవడానికి రెడీ మోడ్ లో ఉంది.

ఇక ఇదే వరసలో శృతిహాసన్ లాస్ ఏంజిల్స్ లో న్యూ ఇయర్ సెలెబ్రేట్ చేసుకుంటుంటే, రష్మిక మండన్న కర్ణాటకలో ఫ్రెండ్స్ తో కలిసి భారీ ఎత్తున హంగామా ప్లాన్ చేసుకుంటుంది. ఇక కేథరిన్ తెరిసా సౌత్ ఆఫ్రికాలో న్యూ ఇయర్ కి వెల్కమ్ చెప్పనుంది.