నాని ‘జెర్సీ’ ఫస్ట్ లుక్ – సింప్లీ సూపర్బ్

Monday,December 31,2018 - 04:49 by Z_CLU

నాని కొత్త సినిమా ‘జెర్సీ’ ఫస్ట్ లుక్ రిలీజయింది. న్యూఇయర్ కానుకగా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. క్రికెట్ గ్రౌండ్ లో మ్యాచ్ జరిగేటప్పుడు   టీమ్ తో ఉన్న సందర్భంలోని  స్టిల్ ని, ఈ సినిమా ఫస్ట్ లుక్ గా రిలీజ్ చేశారు మేకర్స్. రెగ్యులర్ లుక్ తో కంపేర్ చేస్తే, గెడ్డం తో పాటు, కాస్త పొడవాటి జుట్టు తో ఉన్న నాని, స్టైలిష్ క్రికెటర్ లా కనిపిస్తున్నాడు.

మరీ రిస్కీ స్క్రిప్ట్స్ కాకుండా, మినిమం సక్సెస్ గ్యారంటీ అనే కాన్సెప్ట్స్ నే ఎక్కువగా ప్రిఫర్ చేసే నాని, ‘జెర్సీ’ సినిమాని మాత్రం చాలా ఇష్టపడి చేస్తున్నాడు. సినిమా సెట్స్ పైకి రాక ముందే ఈ సినిమా కోసం స్పెషల్ గా ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. ఒకానొక సందర్భంలో ఇది తనకు  గర్వించే సినిమా అవుతుందని చెప్పుకున్నాడు. నాని ఇలాంటి స్టేట్ మెంట్స్ ఇవ్వడం చాలా రేర్. అందుకే ఈ సినిమాపై ఫ్యాన్స్ మ్యాగ్జిమం కాన్సంట్రేషన్ ఫిక్స్ అయి ఉంది.

తనకు ఇష్టమైన క్రికెట్ లో తానెంటో ప్రూఫ్ చేసుకోవడానికి తన ఏజ్ కూడా అడ్డురాలేదు. తన కల, తపనతో పాటు  అర్జున్ 36 వ ఏట జరిగిన 1996 – 97 రంజీ ట్రోఫీ సీజన్ అర్జున్ కి క్రికెట్ పై ఉన్న అభిమానానికి అద్దం పడుతుంది. అంటూ స్వయంగా నాని ట్వీట్ చేశాడు.

సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతుంది జెర్సీ. శ్రద్ధా శ్రీనాథ్ ఈ సినిమాలో హీరోయిన్. గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకి డైరెక్టర్. అనిరుద్ మ్యూజిక్ కంపోజర్. సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాకి ప్రొడ్యూసర్. ‘జెర్సీ’ ని ఏప్రిల్ లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.