అల్లు అర్జున్ కొత్త సినిమా అనౌన్స్ మెంట్

Monday,December 31,2018 - 02:16 by Z_CLU

రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘నా పేరు సూర్య’ తరవాత అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఎవరితో ఉండబోతుందనే సస్పెన్స్  కి  బ్రేక్ పడింది. ‘జులాయి’, ‘S/o సత్యమూర్తి’ లాంటి బ్లాక్ బస్టర్స్ తరవాత మళ్ళీ త్రివిక్రమ్ డైరెక్షన్ లో నటించనున్నాడు అల్లు అర్జున్. ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్.

గతంలో ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన 2 సినిమాలు కంప్లీట్ గా డిఫెరెంటే. ‘జులాయి’ సినిమా ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లే బేస్డ్ అయితే, S/o సత్యమూర్తి అటు ఫ్యామిలీ ఆడియెన్స్ తో పాటు, మాస్ ఆడియెన్స్ కి కూడా తెగ నచ్చేసింది. అందుకే ఈ ఇద్దరి కాంబోలో ఈసారి ఎలాంటి సినిమా తెరకెక్కబోతుందోననే క్యూరియాసిటీ ఫ్యాన్స్ లో కనిపిస్తుంది.

ఆల్మోస్ట్ ప్రీ ప్రొడక్షన్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాని జనవరి 2019 సెట్స్ పైకి తీసుకురానున్నారు మేకర్స్. అల్లు అరవింద్, S. రాధాకృష్ణ సంయుక్తంగా గీతా ఆర్ట్స్, హారిక & హాసినీ క్రియేషన్స్ బ్యానర్స్ పై నిర్మించనున్న ఈ సినిమాకి సంబంధించి తక్కిన వివరాలు త్వరలో అనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.