రీమేక్ చేయాల్సిందే అంటున్న హీరోస్

Wednesday,June 19,2019 - 11:02 by Z_CLU

వీలైనంత వరకు ఒక ఇమేజ్ కి ఫిక్సవ్వకుండా ఉండేందుకే ప్రయత్నిస్తున్నారు హీరోలు. ఈ వరసలో కథ ఎంత డిఫెరెంట్ గా ఉందనిపిస్తే అంత ఈజీగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. వీటి మధ్య  రీమేక్స్ కి కూడా అంతే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. రీసెంట్ గా రామ్ పోతినేని కూడా తమిళ బ్లాక్ బస్టర్ ‘తడమ్’ ని రీమేక్ చేస్తానని అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. తన కరియర్ లో రీమేక్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్. అంతెందుకు ప్రస్తుతం చాలా మంది హీరోలు ఈ రీమేక్స్ తోనే బిజీగా ఉన్నారు.

వరుణ్ తేజ్ : హరీష్ శంకర్ డైరెక్షన్ లో వరుణ్ తేజ్ నటిస్తున్న ‘వాల్మీకి’ తమిళ సూపర్ హిట్ ‘జిగర్తాండ’ కి రీమేకే. తెలుగు నేటివిటీకి దగ్గరగా  చిన్న చిన్న చేంజెస్ చేసినా అసలు కథ మాత్రం అక్కడిదే. ఈ సినిమాలో వరుణ్ తేజ్ నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు.

శర్వానంద్ – ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ‘96’ కూడా తమిళ రీమేకే. తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన ఈ సినిమా తెలుగు వర్షన్ లో శర్వా సరసన సమంతా నటిస్తుంది.

బెల్లంకొండ శ్రీనివాస్ – తమిళంలో సూపర్ హిట్టయిన ‘రాట్ససన్’ కి రీమేకే ఇప్పుడు సెట్స్ పై ఉన్న ‘రాక్షసుడు’.  విష్ణు విశాల్, అమలా పాల్ జంటగా నటించిన ఈ సినిమా తెలుగు వర్షన్ లో అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది. సినిమా డైరెక్టర్ అవుదామని ట్రై చేసి కుదరక పోలీసాఫీసర్ గా సెటిలయిన యంగ్ స్టర్ ఓ సైకిక్ సీరియల్ కిల్లర్ ని ఎలా పట్టుకున్నాడన్నదే ఈ సినిమా.

వెంకటేష్ – వెంకీ కి రీమేక్స్ కొత్త కాదు. కథ బావుంది  అనుకుంటే ఎలాగైనా తెలుగు ఆడియెన్స్ రీచ్ అయ్యేలా చూస్తాడు. ఇప్పుడు ఈ వరసలో హిందీ బ్లాక్ బస్టర్ ‘దేదే ప్యార్ దే’ సినిమా తెరకెక్కబోతుంది. ఈ సినిమాలో 50 ఏళ్ళు పైబడిన బిజినెస్ మ్యాన్ లా కనిపించబోతున్నాడు వెంకీ.