రామ్ కరియర్ లోనే ఫస్ట్ టైమ్

Wednesday,June 19,2019 - 12:03 by Z_CLU

ఆ మధ్య కొంచెం సాఫ్ట్ కథలతో యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్స్ తో ప్లాన్డ్ గా ఉన్న ఎనర్జిటిక్ స్టార్ చిన్నగా ట్రాక్ మార్చాడు. కరియర్ లో ‘ఇస్మార్ట్ శంకర్’ లాంటి మాస్ ఎంటర్ టైనర్ ని చేసి, రామ్ ఇంత డిఫెరెంట్ గా కూడా కనిపిస్తాడా..? అనే ఫీలింగ్ ని జెనెరేట్ చేస్తే, ఈ సినిమా తరవాత ఇంకో స్టెప్పు తీసుకోబోతున్నాడు. ఫ్యూచర్ లో డ్యూయల్ రోల్ లో కనబడబోతున్నాడు.

రీసెంట్ గా తమిళ సూపర్ హిట్ సినిమా ‘తడమ్’ రీమేక్ లో నటించబోతున్నానని అఫీషియల్ గానే కన్ఫమ్ చేశాడు. అయితే ఈ సినిమాలో రామ్ పోతినేని 2 డిఫెరెంట్ రోల్స్ లో కనిపించబోతున్నాడు. ఇందులో ఒక క్యారెక్టర్ లో సాఫ్ట్ రోల్ లో కనిపిస్తే, మరో క్యారెక్టర్ లో దొంగలా కనిపించబోతున్నాడు. రామ్ కరియర్ లోనే డ్యూయల్ రోల్ ప్లే చేయడం ఇదే ఫస్ట్ టైమ్.

మాస్ మసాలా ఉన్న సినిమాలు చేయడం రామ్ కి కొత్త కాదు. కరియర్ బిగినింగ్ లో చేసినవన్నీ అవే. కానీ ఈ మధ్య రిస్క్ ఫ్యాక్టర్ కి దూరంగా, సేఫ్ జోన్ లో అన్నట్టు, ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్స్ కే ప్రిఫరెన్స్ ఇచ్చాడు. కానీ రామ్ స్పీడ్ చూస్తుంటే, బ్యాక్ టు మాస్ అనిపిస్తుంది.

ప్రస్తుతం రిలీజ్ కి రెడీ అవుతున్న ‘ఇస్మార్ట్ శంకర్’ రామ్ కరియర్ లో కొత్త ఫేజ్ లా కనిపిస్తుంది. ఇప్పటికే ఈ ఇస్మార్ట్ శంకర్ క్రేజ్ టాలీవుడ్ లో ఎక్కడ చూసినా కనిపిస్తుంది. అంతలో ఈ ‘తడమ్’ అనౌన్స్ మెంట్. మొత్తానికి కొన్నాళ్ళ పాటు అలా తగ్గి ఉన్నా, తన ఫేవరేట్ జోనర్ ని మళ్ళీ బిగిన్ చేశాడు రామ్ పోతినేని.