విజయ్ దేవరకొండ ఈసారి రచయితగా...

Wednesday,June 19,2019 - 10:02 by Z_CLU

విజయ్ దేవరకొండ సినిమా హిట్టయినా.. ఫ్లాపయినా క్యారెక్టర్ గుర్తుండిపోతుంది. అసలీ క్రేజీ హీరో కథ తరవాత కన్సిడర్ చేసేది క్యారెక్టరే… అందుకే ఈసారి సిల్వర్ స్క్రీన్ పై రేర్ గా కనిపించే క్యారెక్టర్ ‘రచయిత’ గా కనిపించబోతున్నాడు. ఇంకా అఫీషియల్ గా కన్ఫమ్ కాలేదు కానీ.. క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో విజయ్ సినిమాలకు కథలు రాసే ‘రైటర్’ గా నటించబోతున్నాడట.. ఈ లెక్కన విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ నుండి మొదలు రియల్ లైఫ్ లో ఉండే క్యారెక్టర్స్ ని స్క్రీన్ పై సక్సెస్ ఫుల్ ట్రాన్స్ లేట్ చేస్తున్నాడు..

అర్జున్ రెడ్డి : ఈ సినిమాలో డాక్టర్ గా కనిపించాడు. లవ్ స్టోరీ పక్కన పెడితే మందు తాగి ఆపరేషన్ చేయడం ఆనతి సిచ్యు వేషన్స్ జస్ట్ కథకోసం వేషం వేశాడు అనేలా కాకుండా.. రియలిస్టిక్ ఎలిమెంట్స్ లా కనెక్ట్ అయ్యాయి.

మహానటి – ఈ సినిమాలో విజయ్ దేవరకొండది చాలా చిన్న రోల్. కానీ ఫోటో జర్నలిస్ట్ గా మహానటి కథ రాయడానికి ‘మధురవాణి’ని కన్విన్స్ చేయడం దగ్గరి నుండి, ఆ ప్రాసెస్ స్టార్ట్ అవ్వడానికి ఈ క్యారెక్టర్ చాలా అవసరం. ‘విజయ్ ఆంటోని’ గా 100% క్యారెక్టర్ కి న్యాయం చేశాడు విజయ్ దేవరకొండ.

గీత గోవిందం – సినిమాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్. నిజానికి ఈ సినిమా గురించి మాట్లాడాల్సి వస్తే హీరో ప్రొఫెషన్ కన్నా, క్యారెక్టరైజేషన్ గురించే మాట్లాడాలి. కాస్త బెరకుగా, మరి కాస్త సెంటిమెంట్ ఉన్న డీసెంట్ కుర్రాడిలా… ఓపిగ్గా ఉండే అబ్బాయిలా అందరికీ దగ్గరయ్యాడు గోవింద్.. అదే విజయ్ దేవరకొండ.

నోటా – సినిమాలో పాలిటీషియన్ గా నటించాడు. సినిమా అంచనాలు అందుకోవడంలో ఫెయిల్ అయినా, సిల్వర్ స్క్రీన్ ముఖ్యమంత్రుల్లో ఒక్కడిగా చేరిపోయాడు. విజయ్ క్యారెక్టర్ గురించి మాట్లాడినప్పుడు ఈ క్యారెక్టర్ డెఫ్ఫినెట్ గా స్పెషల్ ప్లేస్ లో ఉంటుంది.

టాక్సీవాలా – సినిమాలో ‘డ్రైవర్’ అంటే అలాంటి ఇలాంటి డ్రైవర్ కాదు.. టాక్సీకి కనెక్ట్ అవుతాడు.. ట్యాక్సీ లో ఉండే ఆత్మకి కనెక్ట్.. కథ మొత్తాన్ని తన టాక్సీ లోనే తిప్పుతాడు… విజయ్ దేవరకొండ ప్లే చచేసిన వాటిలో వన్ ఆఫ్ ది  బెస్ట్ క్యారెక్టర్.

డియర్ కామ్రేడ్– ఈ సినిమా గురించి అప్పుడే డీటేల్డ్ గా డిస్కస్ చేయడం కుదరదు కానీ, పవర్ ఫుల్ స్టూడెంట్ గా కనిపించబోతున్నాడు ఈసారి. ఈ క్యారెక్టర్ కూడా విజయ్ కరియర్ లో గుర్తుండిపోయేలా ఉంటుందనే ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.