అజ్ఞాతవాసి నుంచి మరో పాట రెడీ

Thursday,December 07,2017 - 11:44 by Z_CLU

“బయటకొచ్చి చూస్తే” అనే లిరిక్స్ తో సాగే పాటను ఇప్పటికే విడుదల చేశారు. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. రికార్డు స్థాయిలో లైక్స్, వ్యూస్ సాధిస్తోంది. ఇప్పుడు మరో పాట రెడీ అవుతోంది. అవును.. అజ్ఞాతవాసి సినిమాకు సంబంధించి మరో సింగిల్ రిలీజ్ చేయబోతున్నారు. “గాలివాలుగా” అనే సాహిత్యంతో సాగే ఈ పాటను 12వ తేదీన రిలీజ్ చేస్తారు.

అజ్ఞాతవాసి సినిమాలో మొత్తం 5 పాటలున్నాయి. అనిరుధ్ ఈ సినిమాతో సంగీత దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయమౌతున్నాడు. అను ఎమ్మాన్యుయేల్, కీర్తిసురేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకుడు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్నాడు.

ఈ సినిమాకు సంబంధించి ఆడియో రిలీజ్, ప్రీ-రిలీజ్ వేడుకలు పెండింగ్ లో ఉన్నాయి. త్వరలోనే ఈ రెండు వేడుకల్ని నిర్వహించి, సంక్రాంతి కానుకగా జనవరి 10న అజ్ఞాతవాసిని థియేటర్లలోకి తీసుకొస్తారు. అమెరికాలో ఏకంగా 209 ధియేటర్లలో ఈ సినిమా విడుదలవుతోంది.