ఎటు చూసినా తమన్

Sunday,November 10,2019 - 12:02 by Z_CLU

ప్రస్తుతం ఎక్కడ చూసినా తమన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన సాంగ్సే గట్టిగా వినిపిస్తున్నాయి. తమన్ సంగీతం అందించిన పాటలు  వరుసగా రిలీజ్ అవుతూ ట్రెండింగ్ లో నిలుస్తుండటంతో ప్రెజెంట్ టాలీవుడ్ లో తమన్ హవా ఎక్కువగా నడుస్తుందనే కంపిమెంట్ అందుకుంటున్నాడు. తాజాగా ‘వెంకీ మామ’ నుండి టైటిల్ సాంగ్ రిలీజైంది. ఓ పల్లెటూరి వాతావరణంలో మామ అల్లుళ్ళ మీద వచ్చే ఈ సాంగ్ ప్రెజెంట్ అందరినీఎట్రాక్ట్ చేస్తుంది.

అయితే వారం క్రిందటే తమన్ మ్యూజిక్ అందించిన ‘ప్రతి రోజు పండగే’ నుండి ఓ ఫ్యామిలీ సాంగ్ వచ్చి సూపర్ హిట్టైంది. దానికంటే ముందు ‘డిస్కో రాజా’ నుండి ‘నువ్వు నాతో ఏమన్నావో’ సాంగ్ విడుదలైంది. బాలసుబ్రహ్మణ్యం పాడిన ఆ పాట మ్యూజిక్ లవర్స్ బాగా ఆకట్టుకొని మంచి సాంగ్ అనిపించుకుంది.

ఇవన్నీ పక్కన పెడితే ముందుగా తమన హవా నడుస్తుంది అనేట్టుగా చేసిన పాటలు రెండు. అందులో మొదటిది ‘సామజవరగమనా’. ‘అల వైకుంఠపురములో’ నుండి మొదటి రిలీజైన ఈ సాంగ్ గంటల్లోనే ట్రెండింగ్ లో నిలిచి రెండో రోజే వైరల్ అయింది. ఇప్పటికీ ఎక్కడ విన్నా ఇదే సాంగ్ వినిపిస్తుంది. రింగ్ టోన్స్ , కాలర్ టోన్స్ , పార్టీ ల్లో ఫంక్షన్స్ లో అన్నిటిలో ఈ సాంగే ఎక్కువగా వినబడుతోంది.

అలాగే ‘అల వైకుంఠపురములో’ నుండి వచ్చిన మరో సాంగ్ ‘రాములో రాములా’ సాంగ్ కూడా యువతను ఊర్రూతలూగిస్తుంది. ముఖ్యంగా పార్టీ ల్లో , పబ్బుల్లో ఈ సాంగ్ ఎక్కువగా ప్లే అవుతుంది. ఇలా వరుస పెట్టి తమన్ సాంగ్స్ వరుసగా రిలీజవుతూ మిలియన్స్ వ్యూస్ సాదిస్తూ ఎటు చూసినా తమన్ పాటలే అనేలా చేస్తున్నాయి. మరి తమన్ ఇదే స్పీడ్ కంటిన్యూ చేస్తే నెక్స్ట్ ఇయర్ కూడా తమన్ పాటలే ఎక్కువగా వినిపిస్తాయి.