మూడు సినిమాలు ఫిక్స్ చేసుకున్న బన్నీ !

Sunday,November 10,2019 - 01:02 by Z_CLU

ప్రస్తుతం ‘అల వైకుంఠపురములో’ సినిమా చేస్తున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ సుకుమార్ తో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇటివలే లాంచ్ అయిన ఈ సినిమా డిసెంబర్ నుండి సెట్స్ పైకి వెళ్లబోతుంది. ఈ సినిమా తర్వాత మురుగదాస్ డైరెక్షన్ లో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు బన్నీ. ఇప్పటికే ఈ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని సమాచారం. త్వరలోనే ఈ కాంబో సినిమాకి సంబంధించి అనౌన్స్ మెంట్ రానుందని తెలుస్తుంది.

అయితే ఈ రెండు సినిమాల తర్వాత దిల్ రాజు బ్యానర్లో వేణు శ్రీరాంతో కమిటయిన ‘ఐకాన్’ సినిమాను సెట్స్ పైకి తీసుకొస్తాడు స్టైలిష్ స్టార్. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో కూడా తెరకెక్కిస్తారనే టాక్ నడుస్తుంది. సో ‘అల వైకుంఠపురములో’ తర్వాత ఈ మూడు సినిమాలు ఫినిష్ చేసి ఆ తర్వాతే మిగతా ప్రాజెక్ట్స్ గురించి ఆలోచిస్తాడట బన్నీ.