SSMB28 రేపటి నుండి మహేష్ షూటింగ్

Tuesday,January 17,2023 - 11:36 by Z_CLU

సూపర్ స్టార్ మహేష్ బాబు Mahesh Babu , డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రాబోతున్న SSMB28  షూటింగ్ ఎట్టకేలకు రేపటి నుండి మొదలు కానుంది. ఇంతకు ముందు  ఐదు రోజుల పాటు యాక్షన్ ఎపిసోడ్ తీసిన యూనిట్ కి ఆ తర్వాత అనుకోకుండా చాలా పెద్ద బ్రేక్ వచ్చింది. మహేష్ తల్లి ఇందిరా దేవి , తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గార్ల మరణాల కారణం చేత షూటింగ్ వాయిదా పడిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ రేపటి నుండి హైదరాబాద్ లో శరవేగంగా జరగబోతుంది.

అరవై రోజుల పాటు శరవేగంగా ఎలాంటి బ్రేకులు లేకుండా భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఇంతకు ముందు ప్రకటించినట్టు ఆగస్ట్ 11 నే సినిమాను థియేటర్స్ లోకి తీసుకురావాలని భావిస్తున్నారు. మహేష్ సరసన పూజ హెగ్డే Pooja Hegde , శ్రీలీల Sreeleela హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాను హారికా హాసినీ క్రియేషన్స్ బేనర్ పై రాధా కృష్ణ నిర్మిస్తున్నారు. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics