హైదరాబాద్ లో ఖైదీ హంగామా

Tuesday,January 10,2017 - 10:14 by Z_CLU

చిరు రీఎంట్రీ మూవీ… పైగా సంక్రాంతి సీజన్… ఇక ఆ మార్కెట్ ను ఆపేదెవ్వరు. అందుకే థియేటర్లన్నీ ఖైదీపైనే కన్నేశాయి. తమ థియేటర్లలో రేపు ఖైదీ నంబర్ 150 సినిమానే ప్రదర్శించేందుకు ఇంట్రెస్ట్ చూపించాయి. అలా ఒక్క హైదరాాబాద్ లోనే ఈ సినిమాకు సంబంధించి రేపు 300 షోలు వేయబోతున్నారు. తెలుగు సినిమా రిలీజెస్ లో ఇదొక రికార్డు.

khaidi-no-150-1

 

ఇన్ సైడ్ సోర్స్ ప్రకారం… చిరంజీవి సినిమాకు ఇప్పటికే 90 నుంచి వంద కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది. మెగాస్టార్ మార్కెట్, స్టామినా, క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించడానికి ఈ ఫిగరే బెస్ట్ ఎగ్జాంపుల్. దీనికి తోడు ఇప్పుడు ఒక్క హైదరాబాద్ లోనే 3వందలకు పైగా షోలు వేస్తున్నారంటే దటీజ్ మెగాస్టార్. కేవలం హైదరాబాద్ లోనే కాకుండా… విశాఖ, వరంగల్, విజయవాడ లాంటి మేజర్ సిటీస్ లో ఖైదీ నంబర్ 150సినిమాకు సంబంధించి మ్యాగ్జిమమ్ షోలు వేయాలని థియేటర్ యాజమాన్యాలు నిర్ణయించాయి. చూస్తుంటే.. మొదటి రోజే ఖైదీ రికార్డులు బద్దలుకొట్టేట్టు కనిపిస్తున్నాడు.