రామానుజాచర్య బయోపిక్ లో బాలయ్య ?

Thursday,December 08,2022 - 05:52 by Z_CLU

Balayya to play Ramanuja Charya role in his biopic ?

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) మూడేళ్ళ క్రితం తన తండ్రి బయోపిక్ గా వచ్చిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా బాలయ్య మరో బయోపిక్ లో కనిపించేందుకు రెడీ అవుతున్నాడు. శ్రీ రామానుజ చర్య గారి బయోపిక్ లో ఆయన పాత్ర చేయబోతున్నాడని సమాచారం.

హిందు ధర్మం గురించి రామనుజాచర్య వారు  విశిష్టద్వైతమును ప్రతిపాదించిన గొప్ప తత్వ వేత్త మరియు ఆస్తిక హేతువాది. ఆయన కథతో ఒక ఇంటర్నేషనల్ కంపనీతో కలిసి నిర్మాత సి కళ్యాణ్ సినిమాను నిర్మించనున్నారని ఇటివలే ఆయన ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు. ఒక స్టార్ హీరోతో ఆ బయోపిక్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఆ స్టార్ ఎవరు ? బాలయ్య నే ? అనే ప్రశ్నకు అవుననే సమాధానం ఇస్తూ ప్లాన్ చేస్తున్నాం వచ్చే ఏడాదిలో భారీ ఎత్తున లాంచ్ చేస్తాం అంటూ వెల్లడించారు.

ఈ ప్రాజెక్ట్ ను దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు చేతిలో పెట్టాలని భావిస్తున్నారు. త్వరలోనే ఈ బయోపిక్ సినిమాకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ బయటికి రానున్నాయి.