ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ..

Monday,September 26,2016 - 01:56 by Z_CLU

ఆ పని చేస్తే తప్పేంటి..?

అభినేత్రి సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్న తమన్నా హీరోయిన్ లు ఐటం సాంగ్స్ చేసే విషయంలో మనసు విప్పి మాట్లాడింది.  యాక్షన్ పాత్రలను కూడా హీరోయిన్స్ అవలీలగా  చేసేస్తున్నారు. అలాంటిది డ్యాన్స్ కి మంచి స్కోప్ ఉండే ఐటం సాంగ్స్ చేయడంలో తప్పేముంది..? తెలుగులో శృతి హాసన్, కాజల్, సమంతా లే కాదు బాలీవుడ్ లో కూడా మంచి స్టార్ డమ్ ని సొంతం చేసుకున్న  దీపికా పాడుకొనే, కత్రినా కైఫ్ లాంటి హీరోయిన్ లే ఐటం సాంగ్ చేస్తున్నారు. కాబట్టి ఐటం సాంగ్స్ చేయడం నా దృష్టిలో తప్పేం కాదు అనేసింది మిల్కీ బ్యూటీ.

 

అవును ఎక్కువే తీసుకుంటా..?

స్టార్ హీరోలకు ధీటుగా డ్యాన్స్ చేయగల తమన్నా ఆచి తూచి పాత్రలను ఎంచుకుంటూనే మరో వైపు అడపా దడపా ఐటం సాంగ్స్ చేస్తూ అలరిస్తుంది. దక్షిణాది భాషల్లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకునే పనిలో ఉన్న తమన్నా  ఐటం సాంగ్స్ కి మాత్రం భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. ఈ విషయం తానే స్వయంగా ఒప్పుకుంది కూడా. సినిమా సక్సెస్ విషయంలో కీలక పాత్ర పోషించే ఐటం సాంగ్స్ చేయడంలో తనకే మాత్రం అభ్యంతరం లేదని చెప్తూనే భారీ మొత్తం అందజేస్తేనే కానీ అలాంటి పాటలకి సంతకం చేసేది లేదని చెప్పింది తమన్నా.

tamannaah-callage-still-2

ఆ సీక్రెట్ తెలియదంటున్న తమన్నా

ఓ వైపు అభినేత్రి ప్రమోషన్ లో బిజీగా ఉన్న తమన్నా బాహుబలి 2 లో తన పాత్ర వరకు షూటింగ్ పూర్తయిందని తెలిపింది. పనిలో పనిగా బాహుబలి సినిమాలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అని ప్రశ్నిస్తే నిజానికి ఆ సీక్రెట్ తనక్కూడా తెలీదని, అందునా ఆ యాక్షన్ సీక్వెన్సెస్ బాహుబలి 1 షూటింగ్ సమయంలోనే  షూట్ చేసేశారు, కనీసం సెట్ లో మళ్ళీ ఆ సిచ్యువేషన్ కి సంబంధించి డిస్కర్షన్ కూడా ఏమీ జరగలేదు. కాబట్టి ఆ విషయం నాక్కూడా తెలీదు. డైరెక్టర్ రాజమౌళి గారు, కెమెరా మెన్ సెంథిల్, ప్రభాస్ కి తప్ప ఆ విషయం ఇంకెవరికీ తెలిసే ఛాన్సే లేదని చెప్పింది తమన్నా.

ఇకపై అలాంటి సినిమాలు చేయను

ఇకపై అభినేత్రి లాంటి సినిమాలు చేసే ప్రసక్తే లేదని తేల్చేసింది తమన్నా. ప్రభుదేవా, సోను సూద్, తమన్నా ప్రధాన పాత్రలో తెరకెక్కిన అభినేత్రి ప్రమోషన్ లో భాగంగా మాట్లాడిన తమన్నా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కిన అభినేత్రి సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమాలో పాత్ర పరంగా చాలా కష్టపడాల్సి వచ్చిందని అందునా మూడు భాషల్లో ఒకేసారిగా చిత్రించడంతో ప్రతి సీక్వెన్స్ ని రెండు మూడు సార్లు చేయాల్సి వచ్చిందని దాంతో చాలా అలసిపోయేదాన్నని, ఇకపై ఇలాంటి  త్రిభాషా చిత్రం అస్సలు చేయనని చెప్పిందీ అభినేత్రి.

tamannaah-collage-still-1

ఆ హీరోయిన్ తో నన్ను పోల్చకండి

చేతి నిండా భారీ ప్రాజెక్ట్ లతో క్షణం తీరిక లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న మిల్కీ బ్యూటీ ఆ హీరోయిన్ తో నన్ను పోల్చకండి అని కాస్త గట్టిగానే అనేసింది. ఇటీవల స్టార్ హీరోయిన్ లు కూడా పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యే ఆలోచనలో ఉన్నారు. మీ పెళ్ళెప్పుడు అని అడిగిన ప్రశ్నకు ఎవరి ప్లానింగ్స్ వాళ్లకు ఉంటాయి. పెళ్లి చేసుకోవాలి అనుకున్న వాళ్ళు పెళ్లి చేసుకుంటారు కరియర్ కంటిన్యూ చేయాలి అనుకునే వాళ్ళు కరియర్ గురించి ఆలోచిస్తారు. నా ప్లాన్స్  నాకున్నాయి కాబట్టి నన్ను ఆ హీరోయిన్ తో పోల్చకండి అంది తమన్నా.