మల్టీస్టారర్ కు రెడీ...?

Monday,September 26,2016 - 04:11 by Z_CLU

 గతంలో మూవీ మొఘల్ రామానాయుడు అక్కినేని నాగ చైతన్య, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో గుండమ్మ కథను రీమేక్ చేయాలని తాపత్రయపడ్డారు. కానీ అది ఇప్పటికీ కుదరలేదు. కానీ ఈ మహానటుల వారసులు స్క్రీన్ పంచుకోవడానికి ఒక అద్భుతమైన కథ సిద్ధమైంది. కానీ ఆ కథ గుండమ్మ కథ కాదు. మహానటి సావిత్రి బయోపిక్.

ntr-naga-chaithanya-collage

 

      అంతటి మహానటి జీవిత కథలో ఎన్టీఆర్ , నాగేశ్వర్ రావు గారి ప్రస్తావన లేకుండా ఎలా ఉంటుంది. అందుకే ఆ మహానటుల క్యారెక్టర్స్ లో యంగ్ టైగర్, చైతూ కనిపించనున్నారట. ఈ సినిమాలో సావిత్రి క్యారెక్టర్ లో నిత్యా మీనన్ నటిస్తుండగా కొన్ని కీలక సన్నివేశాల్లో గెస్ట్ అప్పియరెన్స్ లో ఈ ఇద్దరు హీరోలు మెరుస్తారని సమాచారం. ఈ సినిమాను అశ్వనీదత్ నిర్మిస్తుండగా, ఆయన అల్లుడు నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. మరి గుండమ్మకథ కోసం అనుకున్న కాంబినేషన్… మహానటి కోసం వర్కవుట్ అవుతుందా లేదా అనేది చూడాలి.