ఆ హీరోకు పూర్తి మద్దతు...

Sunday,September 25,2016 - 01:20 by Z_CLU

ఎన్నో బ్రాండ్స్ కు ప్రచారకర్తగా వ్యవహరించాడు మహేష్. టాలీవుడ్ లో ఇన్ని ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేసిన హీరో మరొకరు లేరు. అంతలా యాడ్ మార్కెట్లో తన స్టామినా ఏంటో చూపించాడు మహేష్. అగ్రిమెంట్ పూర్తయిన వెంటనే ఆ ప్రాడక్ట్ నుంచి మహేష్ బయటకు వచ్చేయడం కామన్. అయితే ఎలాంటి ఎగ్రిమెంట్స్ లేకుండా ఒక్క విషయంలో మాత్రం ఫుల్ టైం బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తున్నాడు మహేష్. తన కుటుంబం నుంచి ఎవరు హీరోగా వచ్చినా వాళ్లకు తన ఫుల్ సపోర్ట్ అందిస్తున్నాడు. గతంలో సుధీర్ బాబుకు ఇలానే మద్దతు పలికాడు. అతడితో కలిసి ఇంటర్వ్యూల్లో కూడా పాల్గొన్నాడు. ఇప్పుడు తన కాంపౌండ్ నుంచి వస్తున్న మరో హీరోకు ప్రచారం కల్పించబోతున్నాడు ప్రిన్స్.
hqdefault
నరేష్ కొడుకు నవీన్ విజయ్ కృష్ణ త్వరలోనే హీరోగా పరిచయం కాబోతున్నాడు. అతడు నటించిన అతడు నటించిన నందిని నర్సింగ్ హోం అనే సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాకు ప్రత్యేకంగా ప్రచారం కల్పించడానికి మహేష్ రెడీ అయ్యాడు. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కు ప్రత్యేక అతిథిగా హాజరవ్వాలని నిర్ణయించడమే  కాకుండా… సినిమా విడుదల టైమ్ లో నవీన్ కు ఫుల్ బూస్టప్ ఇవ్వడానికి మహేష్ రెడీ అవుతున్నాడు.