మరికొన్ని గంటల్లో సైరా ట్రయిలర్

Wednesday,September 18,2019 - 11:56 by Z_CLU

టాలీవుడ్ మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ సైరా ట్రయిలర్ మరికొన్ని గంటల్లో మార్కెట్లోకి రాబోతోంది. సరిగ్గా ఈరోజు సాయంత్రం 5 గంటల 31 నిమిషాలకు ట్రయిలర్ ను రిలీజ్ చేయబోతున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతోంది ట్రయిలర్.

టీజర్ తో ఇప్పటికే సినిమాపై ఓ క్లారిటీ ఇచ్చారు మేకర్స్. కేవలం చిరంజీవి లుక్స్ కే పరిమితం కాకుండా.. స్టోరీలైన్ తో పాటు మిగతా ఆర్టిస్టులందరికీ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇప్పడు ట్రయిలర్ లో కూడా అదే ఫార్మాట్ ఫాలో అవుతున్నారు. దీంతో పాటు సినిమా కోసం పెట్టిన ఖర్చు, భారీతనం కనిపించేలా ట్రయిలర్ ఉండబోతోంది.

తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని థియేటర్లలో సాయంత్రం, ఈ ట్రయిలర్ ను ఎక్స్ క్లూజివ్ గా ప్రసారం చేయబోతున్నారు. హైదరాబాద్ సుదర్శన్ థియేటర్ తో పాటు.. వైజాగ్ జగదాంబ, విజయవాడ అప్సర థియేటర్లలో ఈ ట్రయిలర్ ను ఎక్స్ క్లూజివ్ గా ప్రదర్శిస్తారు. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో 96 థియేటర్లలో ఈరోజు సాయంత్రం సైరా ట్రయిలర్ ను ప్రదర్శిస్తారు.