ప్లే బాయ్ గా విజయ్ దేవరకొండ...?

Wednesday,September 18,2019 - 11:02 by Z_CLU

ఒకరా.. ఇద్దరా.. నలుగురు హీరోయిన్స్ విజయ్ దేవరకొండ కొత్త సినిమాలో. రాశిఖన్నా, ఐశ్వర్య రాజేష్, క్యాథరీన్, ఇసాబెల్లా… ఇంతమంది దేనికీ..? ఇప్పటివరకు విజయ్ దేవరకొండ సినిమాల్లో ఇంతమంది హీరోయిన్స్ ఉన్న దాఖలాలు లేవు. సినిమాలో ఇంతమంది హీరోయిన్స్ ఉన్నారు అంటే విజయ్ దేవరకొండ ఈ సినిమాలో ప్లే బాయ్ లా కనిపించబోతున్నాడా..? ఈ స్పెక్యులేషన్ ని మరింత స్ట్రాంగ్ చేస్తుంది ఈ సినిమా టైటిల్.

‘వరల్డ్ ఫేమస్ లవర్’ కచ్చితంగా లవ్ ఎంటర్టైనరనేది మాత్రం కన్ఫమ్. అందునా ఈ టైటిల్ హీరోకి ఒక్క లవ్ స్టోరీ కాదు అంతకు మించి ఉండబోతున్నాయి అనే హింట్ ఇస్తుంది. ఇప్పటి దాకా అగ్రెసివ్ హీరో దగ్గరి నుండి గుడ్ బాయ్ అనిపించే క్యారెక్టర్స్  వరకు ప్లే చేసిన విజయ్ దేవరకొండ ఈసారి ప్లే బాయ్ లా కనిపించబోతున్నాడన్నమాట.

ప్రస్తుతానికి ఈ సినిమా ఖచ్చితంగా ఇలాగే ఉండబోతుందనే కన్ఫర్మేషన్ అయితే లేదు కానీ, విజయ్ దేవరకొండ మాత్రం ఈసారి సమ్ థింగ్ స్పెషల్ ప్లాన్ చేశాడనే సిగ్నల్స్ అందుతున్నాయి.

‘వరల్డ్ ఫేమస్ లవర్’ అనే టైటిల్ తోనే యూత్ లో వైబ్స్ ని క్రియేట్ చేసిన మేకర్స్ 20వ తేదీన సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్నారు.