మెగా హీరోలు – రీమిక్స్ లు

Wednesday,September 18,2019 - 12:03 by Z_CLU

‘వాల్మీకి’ రిలీజ్ కి ముందే ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తుంది. దానికి తోడు ‘ఎల్లువొచ్చి గోదారమ్మా’ రీమిక్స్ సాంగ్ క్రియేట్ చేస్తున్న సెన్సేషన్ అంతా ఇంతా కాదు. గతంలో కూడా మెగా హీరోలు సిచ్యువేషనల్ గా మెగా స్టార్ క్లాసిక్ హిట్స్ ని రీమిక్స్ చేసిన వాళ్ళే.. కానీ వరుణ్ తేజ్ ఒక్కడికే శోభన్ బాబు సాంగ్ పడింది.

సాయి తేజ్ – ఈ మెగా హీరో ఏకంగా 4 మెగా సాంగ్స్ రీమిక్స్ లో నటించాడు. ఆల్రెడీ ఫ్యాన్స్ మోస్ట్ ఫేవరేట్ లిస్టులో ఉండే ‘గువ్వా గోరింకా’, ‘అందం హిందోళం’, ‘చమ్మక్ చమ్మక్ చమ్’ ‘శుభలేఖ రాసుకున్న’ ని సాంగ్స్ యూత్ కి మరింత దగ్గర చేశాడు. తన స్థాయిలో పాత సాంగ్స్ కి ఉన్న గ్రేస్ తగ్గకుండా అద్భుతంగా పర్ఫామ్ చేశాడు సాయి తేజ్.

రామ్ చరణ్ –  మగధీర ‘బంగారు కోడిపెట్ట’ తో స్టార్ట్ అయితే మరో 2 బ్లాక్ బస్టర్ క్లాసిక్స్ ని రీమేక్ చేశాడు చెర్రీ. ‘శుభలేఖ రాసుకున్న’ ‘వానా వానా వెల్లువాయే’ సాంగ్స్ ఓల్డ్ వర్షన్స్ ఎంతగా ఆకట్టుకున్నాయో… ఈ రీమిక్స్  వర్షన్స్ కూడా ఫ్యాన్స్ ని అంతే మెస్మరైజ్ చేశాయి.