ఇంకా వీడని సస్పెన్స్

Thursday,November 03,2016 - 10:00 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ లో ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా పై పెద్ద చర్చే జరుగుతుంది. అసలింతకీ ‘జనతా గ్యారేజ్’ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత తారక్ ఇంత గ్యాప్ తీసుకోవడానికి కారణం ఏమై ఉంటుందా? అని ఆరా తీస్తున్నారు సినీ జనాలు.మరోవైపు తమ అభిమాన హీరో ఎప్పుడెప్పుడు సినిమా మొదలెడతాడా? ఏ డైరెక్టర్ కి ఛాన్స్ ఇస్తాడా? అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఎన్టీఆర్ ఫాన్స్. ‘జనతా గ్యారేజ్’ తరువాత వక్కంతం తో తారక్ సినిమా చేస్తాడనుకున్నారంతా. కానీ ఈ కాంబినేషన్ సెట్ అవ్వలేదనని స్వయంంగా కల్యాణ్ రామ్ ప్రకటించాడు.

ఇక తాజాగా పూరి, త్రివిక్రమ్ పేర్లు కూడా వినిపించినప్పటికీ యంగ్ టైగర్ మాత్రం ఇంకా తన నెక్స్ట్ సినిమా పై నోరు విప్పడం లేదు. అయితే కచ్చితంగా బ్లాక్ బస్టర్ ఇచ్చే దర్శకుడితోనే సెట్స్ పైకి వెళ్లాలని తారక్ గట్టిగా ఫిక్స్ అయ్యాడు. ‘టెంపర్’, ‘నాన్నకు ప్రేమ తో’, ‘జనతా గ్యారేజ్’ వంటి వరుస విజయాల తరువాత మరోసారి ఆ ఫ్లో మిస్అవ్వకూడదని నెక్స్ట్ సినిమాకు చాలా కేర్ తీసుకుంటున్నాడు యంగ్ టైగర్. అయితే దర్శకుడెవరైనా, ఎన్టీఆర్ తన అన్నయ్య కళ్యాణ్ రామ్ కు చెందిన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పైనే నెక్ట్స్ మూవీ చేస్తాడట. ఎన్టీఆర్ ఇంకెన్ని రోజులు ఇలా సస్పెన్స్ కొనసాగిస్తాడో చూడాలి.