మెగా ప్రమోషన్

Thursday,November 03,2016 - 12:56 by Z_CLU

మెగా కాంపౌండ్ లో ఇప్పుడు రెండు సినిమాలు అత్యంత కీలకంగా మారాయి. ఆ రెండు సినిమాల్లో ఒకటి ఖైదీ నంబర్-150 కాగా.. రెండోది ధృవ. ఖైదీ నంబర్-150 సినిమా చిరంజీవి రీఎంట్రీ మూవీ. ఈ సినిమాతో కచ్చితంగా చిరంజీవి మెగాహిట్ అందుకోవాలి. అటు రామ్ చరణ్ కూడా ధృవ  సినిమాతో మెగారేంజ్ సక్సెస్ కోసం ట్రై చేస్తున్నాడు.అందుకే ఈ రెండు సినిమాలు ఇప్పుడు మెగా కాంపౌండ్ కు అత్యంత కీలకంగా  మారాయి.

pawan-kalyan-759

ఇప్పుడీ సినిమాల్ని ఎలాగైనా సక్సెస్ చేసేందుకు, క్రేజ్ తీసుకొచ్చేందుకు ఓ నయా ప్లానింగ్ తో ముందుకొస్తోంది మెగా కాంపౌండ్. ఈ రెండు సినిమాల్లో  పవన్ ను ఇన్ వాల్వ్  చేయాలని అనుకుంటున్నారట. ఖైదీ నంబర్-150, ధృవ సినిమాల ప్రమోషన్లలో పవన్ కు భాగం కల్పించి.. ఆ రెండు సినిమాల రేంజ్ ను ఇంకాస్త పెంచాలని మెగా కాంపౌండ్ భావిస్తోందట. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ రెండు సినిమా ఆడియో వేడుకలకు పవన్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యే అవకాశం ఉంది.