జీవితంలో పెళ్లి చేసుకోను...

Thursday,November 03,2016 - 09:40 by Z_CLU

లాంగ్ గ్యాప్ తర్వాత నరుడా డోనరుడా సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్న సుమంత్.. ప్రచారంలో భాగంగా తన వ్యక్తిగత విషయాల్ని కూడా మీడియాతో పంచుకున్నాడు. భవిష్యత్తులో మరోసారి పెళ్లి చేసుకునే ఆలోచన తనకు లేదని సూటిగా చెప్పేశాడు ఈ అక్కినేని హీరో. గతంలో కీర్తిరెడ్డిని వివాహం చేసుకున్నాడు సుమంత్. అయితే ఆ బంధం ఎక్కువ రోజులు కొనసాగలేదు. ఆ పెళ్లి తన జీవితానికి సరిపోతుందని, ఇకపై మరో పెళ్లి చేసుకోనని సుమంత్ క్లారిటీ ఇచ్చాడు.

మళ్లీ ఇన్నాళ్లకు సడెన్ గా సుమంత్ రెండో పెళ్లిపై మాట్లాడ్డానికి మరో కారణం కూడా ఉంది. ఈమధ్య ఓ హీరోయిన్ తో సుమంత్ చాలా క్లోజ్ గా ఉంటున్నాడని, ఆమెను త్వరలోనే పెళ్లాడబోతున్నాడంటూ కొన్ని వార్తలు వచ్చాయి. అలాంటిదేం లేదని సదరు హీరోయిన్ క్లారిటీ కూడా ఇచ్చింది. తాజాగా ఇప్పుడు సుమంత్ కూడా సేమ్ క్లారిటీ ఇచ్చాడు.