ఇక నుంచి నేను విలన్ వేషాలు వేసుకోవచ్చు

Wednesday,January 29,2020 - 03:02 by Z_CLU

విలన్ అవుదామని ఇండస్ట్రీకొచ్చాడు సునీల్. అనుకోకుండా కమెడియన్ అయ్యాడు. ఆ సెగ్మెంట్ లో కింగ్ అనిపించుకున్నాడు. ఆ తర్వాత అనుకోకుండా హీరో కూడా అయ్యాడు. అక్కడ కూడా ఓ బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. ఆ తర్వాత తిరిగి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాడు. ఇలా ఎన్ని అవతారాలు ఎత్తినా తన మనసులో ఉన్న విలన్ కోరిక మాత్రం తీర్చుకోలేకపోయాడు

ఎట్టకేలకు సునీల్ కు ఆ ఛాన్స్ రానే వచ్చింది. రీసెంట్ గా థియేటర్లలోకొచ్చిన డిస్కోరాజా సినిమాలో విలన్ పాత్ర పోషించాడు ఈ హాస్యనటుడు. సినిమా క్లైమాక్స్ కు వచ్చేవరకు సునీల్ విలన్ అనే విషయం ఎవ్వరికీ తెలియదు. అంతలా సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ, ఆఖరి నిమిషంలో దాన్ని రివీల్ చేశారు. ఇలా తనను విలన్ గా ఆదరించిన అందరికీ థ్యాంక్స్ చెబుతున్నాడు సునీల్.

“డిస్కోరాజాతో నా జీవితంలో ఓ కొత్త యాంగిల్ ఓపెన్ అయింది. సినిమాలో నా క్యారెక్టర్ లైక్ చేసిన అందరికీ థ్యాంక్స్. ఇకపై నేను కూడా మలయాళం, కన్నడ, తమిళ్ లాంగ్వేజెస్ కు వెళ్లి, సిక్స్ ప్యాక్ చేసిన తెలుగు విలన్ గా అక్కడ పేరు తెచ్చుకోవాలని ఉంది.”