‘అశ్వత్థామ’ కొత్తగా ఉంటుంది – దర్శకుడు రమణతేజ

Wednesday,January 29,2020 - 02:50 by Z_CLU

నాగశౌర్య ఇమేజ్ కి బియాండ్ డైరెక్షన్ లో తెరకెక్కింది ‘అశ్వత్థామ’. రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కడం అందునా ఈ కథని స్వయంగా నాగశౌర్య రాసుకోవడం లాంటి అంశాలు ఈ సినిమాని ప్రీ రిలీజ్ లైమ్ లైట్ లోకి తీసుకువస్తుంటే, ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్న రమణతేజ ఈ సినిమాని ఎంత స్పెషల్ గా ట్రీట్ చేశారో చెప్పుకున్నాడు.

‘సినిమా మొత్తం అశ్వత్థామ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే ఉంటుంది. తన రియాక్షన్, స్ట్రగుల్.. మోటివ్… అందుకే సినిమాని కొత్తగా ట్రీట్ చేశాం. సినిమాలో ఒక షాట్ పెట్టామంటే, దానికి ఖచ్చితంగా ఒక రీజన్ ఉంటుంది. ఒకక్ మాటలో చెప్పాలంటే ఇది డిఫెరెంట్ టైప్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్…’ అని చెప్పుకున్నాడు.

U.S. లో స్క్రీన్ ప్లే రైటింగ్ కోర్స్ మాస్టర్స్ చేసిన రమణ తేజ తన డెబ్యూకి ఇది పర్ఫెక్ట్ కథ అని చెప్పుకున్నాడు. ‘ఛలో’ సినిమా నుండి నాగశౌర్యకి తనక్ మధ్య బిల్డ్ అయిన రిలేషన్ షిప్ వల్లే తనకు ఈ అవకాశం వచ్చిందని చెప్పుకున్న రమణ తేజ, ఈ సినిమాని తెరకెక్కించే ప్రాసెస్ లో నాగశౌర్య తనకు అన్ని విధాలుగా ఫ్రీడమ్ ఇచ్చాడని కూడా గుర్తు చేసుకున్నాడు.

ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కింది ‘అశ్వత్థామ’. యాక్షన్ హీరోగానే కాదు ఈ సినిమా సక్సెస్ అవ్వాలి కానీ, ఫ్యూచర్ లో మరిన్ని కథలు రాయాలనే ఆలోచనలో ఉన్నాడు నాగశౌర్య. జనవరి 31 ఈ సినిమా రిలీజ్ డేట్.