K. S. రామారావు ఇంటర్వ్యూ

Wednesday,January 29,2020 - 05:32 by Z_CLU

వ్యాలెంటైన్స్ డే కానుకగా రిలీజవుతుంది వరల్డ్ ఫేమస్ లవర్. ఈ సందర్భంగా ఈ సినిమా తెరకెక్కించే ప్రాసెస్ లో  తెర వెనక జరిగిన కథల్ని మీడియాతో షేర్ చేసుకున్నారు నిర్మాత K.S. రామారావు. ఆ విషయాలు మీకోసం…

నలుగురు అమ్మాయిలు…

సినిమాలో కథను బట్టే హీరోయిన్ల అంకె ఉంటుంది. ఈ కథకి నలుగురు అమ్మాయిలూ అవసరమే…

అప్పుడే అనిపించింది…

విజయ దేవరకొండ ‘పెళ్లి చూపులు’ చూసినప్పుడే ప్రత్యేకమైన ఆర్టిస్ట్ అనిపించాడు. అలా చాలా తక్కువ మంది ఉంటారు. రవితేజ కూడా అలాంటివాడే… ఏదో ప్రత్యేకత ఉంటుంది వారిలో…

దర్శకుడు కార్తీక్ మాధవ్…  

కార్తీక్ మాధవ్ కొత్త తరహా టెక్నీషియన్… వెల్ ఎడ్యుకేటెడ్… మణిపాల్ యూనివర్సిటీ లో మాస్ మీడియా చేశాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం ఉండాలనే ‘ఓనమాలు’ చేశాడు. ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’.. కూడా అలాంటిదే. కల్చర్ సినిమాలే చేస్తాడు. ఆడియెన్స్ థియేటర్ కి వెళ్తే… సినిమా అభిమానులు కొత్తగా ఉందే…  ప్లెజెంట్ గా ఉందే అని ఫీలయ్యే సినిమాలే చేస్తాడు.

ఆలస్యమే… కానీ అనుకున్నదే…

అక్టోబర్ 12, 2018 లో షూటింగ్ స్టార్ట్ చేశాం. డిఫెరెంట్ టైమ్స్ లో నడిచే స్టోరీ ఇది. ఇక హీరోయిన్స్ వరకు వచ్చేసరికి వాళ్ళ డేట్స్ ఎప్పుడు దొరికితే అప్పుడు షూట్ చేసుకున్నాం. దానికి తోడు విజయదేవరకొండ బిజీ.. అంతలోనే ‘డియర్ కామ్రేడ్’ బిగిన్ అవ్వడంతో మళ్ళీ ఈ సినిమా చేయలేకపోయాడు. దానికి తోడు హీరో గెటప్స్ విషయంలో  ఎక్స్ పెక్ట్ చేసిన టెక్నికల్ ఇబ్బందులు…  జస్ట్ గెడ్డం విషయంలోనే 2, 3 నెలలు ఆగాల్సి వచ్చేది. ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీరీజనబుల్ కారణాలే. ఇక రిలీజ్ విషయానికి వస్తే డిసెంబర్, జనవరిలో రిలీజ్ చేసుకోవచ్చు. కాకపోతే అది కరెక్ట్ టైమ్ కాదని ఫిబ్రవరి ఫిక్సయ్యాం… లేటయినా పర్వాలేదు కాకపోతే కరెక్ట్ టైమ్ కి రావాలనుకున్నాం…

టార్గెట్ లవర్స్…

వరల్డ్ ఫేమస్ లవర్ టార్గెట్ లవర్సే. అది యూత్ లో ఉండే లవర్స్ కావచ్చు.. మిడ్ ఏజ్ లో ఉండేవాళ్ళు అవ్వచ్చు… ముసలివాళ్ళు అవ్వచ్చు… ఎవ్వరైనా కావచ్చు.. లవ్ అనేది ఎవరైనా కామనే…

అభిషేక్ నామా అలా కలిశాడు…

మంచి సినిమా చేయాలనే ఉద్దేశంతో అభిషేక్ నామా కూడా ఇందులో భాగమయ్యాడు. దాంతో పాటు విజయదేవరకొండతో సినిమా చేయాలని చాలా మంది నిర్మాతలు అనుకుంటూ ఉంటారు. అయితే అందరికీ విజయ్ దేవరకొండ అందుబాటులో లేడు.. అందుకే ఈ సినిమాతో కలిశాడు. అందుకే అభిషేక్ నామా ఆంధ్రా ఏరియాకి, సునీల్ నారాయణ నిజామ్ ఏరియాకు గాను నిర్మాణంలో భాగమవ్వడం జరిగింది.

ఏది ఏమైనా అదే…

ఎవరు కలిసినా, ఎవరు నిర్మించినా, క్రాంతి మాధవ్, విజయ్ దేవరకొండ ఇద్దరు కలిసి కొత్త ట్రెండ్ తో కూడిన మంచి సినిమా చేశారు. ఇద్దరు బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టారు. వాళ్లకు సంపూర్ణ సహకారం అందించారు రాశి ఖన్నా, ఐశ్వర్యా రాజేష్,  కేథరిన్, ఇసబెల్లా. ప్రతి ఒక్కరు డెడికేటెడ్ గా నటించారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండని డిఫెరెంట్ స్టోరీస్ లో చూస్తారు.

వరల్డ్ ఫేమస్ లవర్..

విజయ్ దేవరకొండకి తగ్గ టైటిల్ అని నా ఫీలింగ్. అతను మామూలుగానే వరల్డ్ ఫేమస్ లవర్…