జీ ఎక్స్ క్లూజివ్: విలన్ గా సునీల్

Monday,December 30,2019 - 11:40 by Z_CLU

కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన సునీల్ కు మనసులో మాత్రం విలన్ గా చేయాలనే కోరిక ఎప్పట్నుంచో ఉంది. కానీ హాస్యనటుడిగా క్లిక్ అవ్వడంతో అదే కెరీర్ ను కొనసాగించాడు. ఆ తర్వాత హీరోగా కూడా మెరిశాడు. ఎట్టకేలకు సునీల్ కోరిక నెరవేరింది. ఓ సినిమాలో అతడు విలన్ గా కనిపించబోతున్నాడు.

రీసెంట్ గా కలర్ ఫొటో అనే సినిమా స్టార్ట్ అయింది. సుహాస్, చాందిని చౌదరీ హీరోహీరోయిన్లుగా రాబోతున్న ఆ సినిమాలో విలన్ గా కనిపించబోతున్నాడు సునీల్. యూట్యూబ్ లో పాపులరైన సందీప్ రాజ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు, అలాగే మత్తు వదలరా సినిమాతో సక్సెస్ అందుకున్న కీరవాణి అబ్బాయి కాల భైరవ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

కామెడీ ఎంటర్ టైనర్ గా, 1995లో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో జరిగే ప్రేమకథ కాన్సెప్ట్ తో ఈ సినిమా రాబోతోంది. ఇందులో విలన్ గా సునీల్ ఏ మేరకు మెప్పిస్తాడో చూడాలి.