మాస్ మహారాజా నుండి రెండు సినిమాలు !

Sunday,December 15,2019 - 01:07 by Z_CLU

ప్రతీ ఏడాది ఓ రెండు సినిమాలు చేసే రవి తేజ ఈ ఏడాది మాత్రం బ్రేక్ ఇచ్చాడు. ఈ ఏడాది గ్యాప్ వచ్చే ఏడాది రెండు సినిమాలతో భర్తీ చేయబోతున్నాడు. ప్రస్తుతం ‘డిస్కో రాజా’ సినిమా చేస్తున్న మాస్ మహారాజా ఈ సినిమాతో వచ్చే ఏడాది ఆరంభంలోనే థియేటర్స్ లోకి రానున్నాడు. జనవరి 24న విడుదల అవుతోంది.

గోపీచంద్ మలినేనితో రవితేజ చేస్తున్న’క్రాక్’ సినిమా ప్రెజెంట్ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లేదా దసరా కి థియేటర్స్ లోకి తీసుకురావాలని చూస్తున్నారు. సో నెక్స్ట్ ఇయర్ మాస్ మహారాజా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో సందడి చేయబోతున్నాడన్నమాట.