విజయ్ దేవరకొండకు నచ్చని పని చేస్తే...?

Monday,September 03,2018 - 05:14 by Z_CLU

విజయ్ దేవరకొండ ‘నోటా’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజయింది. సెప్టెంబర్ 6 న సాయంత్రం 4 గంటలకు ఈ ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు ఫిలిమ్ మేకర్స్. అయితే విజయ్ దేవరకొండ ఈ ట్రైలర్ గురించి ట్వీట్ చేస్తూ, నాకు పాలిటిక్స్ అంటే అస్సలిష్టం ఉండదు. కానీ చేస్తే ఇలా ఉంటుంది’ అని పోస్ట్ చేశాడు. దాంతో విజయ్ ఫ్యాన్స్ లో ఈ ట్రైలర్ ఎప్పుడెప్పుడు చూస్తామా అనే క్యూరాసిటీ రేజ్ అవుతుంది.

ఇప్పటి వరకు యూత్ ఫుల్ ఎంటర్ టైనర్స్ తో ఇంప్రెస్ చేసిన విజయ్ దేవరకొండ, ఈ సినిమాలో కంప్లీట్ గా డిఫెరెంట్ ఆంగిల్ లో కనిపించనున్నాడు. ఈ సినిమాతో కోలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్న విజయ్ దేవరకొండ, ఫ్యాన్స్ లో ఉన్న క్రేజ్ ని మరింత పెంచుకోనున్నాడు.

ఈ సినిమాలో విజయ్ సరసన మెహరీన్ తో పాటు సంచనా నటరాజన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.  ఆనంద్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘నోటా’ ను జ్ఞానవేల్ రాజా, స్టూడియో గ్రీన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శంకర్-ఎహసాన్-లాయ్ మ్యూజిక్ కంపోజర్స్. ఈ సినిమాని అక్టోబర్ లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు ఫిల్మ్ మేకర్స్.