పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో సునీల్ సినిమా

Monday,September 04,2017 - 03:44 by Z_CLU

సునీల్ సినిమా డబ్బింగ్ పనులు బిగిన్ అయ్యాయి. హిందీ సూపర్ హిట్ సినిమా ‘2 కంట్రీస్’ కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇవాళ్టి నుండే పోస్ట్ ప్రొడక్షన్ బిగిన్ చేసుకున్న సినిమా యూనిట్, సినిమా సూపర్ హిట్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉంది.

N.శంకర్ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టైటిల్ ఇంకా డిసైడ్ కాలేదు. రైట్ టైమ్ చూసుకుని ఈ సినిమా టైటిల్ తో పాటు, ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది సినిమా యూనిట్. ఈ సినిమా మహాలక్ష్మి ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కుతుంది. గోపీ సుందర్ ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేశాడు.