సునీల్ కోసం అమెరికాలో ఆడిషన్స్

Wednesday,December 07,2016 - 07:00 by Z_CLU

ఎన్‌కౌంట‌ర్‌, శ్రీరాముల‌య్య‌, జ‌యం మ‌న‌దేరా, భద్రాచ‌లం, జై బోలో తెలంగాణ వంటి చిత్రాల‌తో ద‌ర్శ‌కుడిగా త‌న‌దైన గుర్తింపు తెచ్చుకున్న ఎన్‌.శంక‌ర్… సునీల్ హీరోగా మ‌ల‌యాళ చిత్రం ‘టు కంట్రీస్‌’ను రీమేక్ చేస్తున్నాడు. ద‌ర్శ‌క‌త్వంతో పాటు ఈ చిత్రానికి నిర్మాత‌గా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు ఎన్.శంకర్. ఈ సినిమాకు సంబంధించి ఎక్కువభాగాన్ని అమెరికాలో చిత్రీకరించబోతున్నారు. అందుక‌ని అమెరికాలోని తెలుగు అమెరిక‌న్స్ ఉంటే బావుంటుంద‌ని ఆలోచించి… వారికోసం యు.ఎస్‌లో స్టార్ హంట్‌ నిర్వ‌హిస్తున్నారు. ప్రస్తుతం ఆర్లాండ్, న్యూయార్క్ నగరాల్లో ఆడిషన్స్ నిర్వహిస్తారు. డిసెంబర్ 10న ఆర్లాండ్ లో… 14న న్యూయార్క్ లో ఈ స్టార్ హంట్ జరుగుతుంది. నటీనటుల్ని సెలక్ట్ చేసిన వెంటనే సినిమా సెట్స్ పైకి వస్తుంది.