'ప్రాజెక్ట్ Z ' తో రెడీ అవుతున్న సందీప్ కిషన్
Saturday,May 06,2017 - 10:00 by Z_CLU
సందీప్ కిషన్, లావణ్య త్రిపాటి హీరో హీరోయిన్స్ గా జాకీష్రాఫ్ ప్రధాన పాత్రల్లో సి.వి. కుమార్ దర్శకత్వంలో తమిళ్‌లో తెరకెక్కిన ‘మాయావన్’ సినిమాను తెలుగు లో ‘ప్రాజెక్ట్ z’ టైటిల్ తో ఎస్.కె. కరీమున్నీసా తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. సందీప్ కిషన్ పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్ లో నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే థియేటర్స్ లోకి రానుంది..

సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. సందీప్ కిషన్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఆడియో ను అతి త్వరలో రిలీజ్ చేసి, మే నెలలో సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.