చైతు హంగామా షురూ....

Saturday,May 06,2017 - 11:30 by Z_CLU

అక్కినేని నాగ చైతన్య తన నెక్స్ట్ సినిమాతో హంగామా చేయడానికి రెడీ అవుతున్నాడు. లేటెస్ట్ గా సోగ్గాడే చిన్నినాయన ఫేమ్ కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాను పూర్తిచేసిన చైతు ఈ సినిమా ప్రమోషన్ ను ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తూ అక్కినేని ఫాన్స్ లో జోష్ నింపబోతున్నాడు..అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకొని రీలీజ్ కి రెడీ అవుతుంది..

ప్రెజెంట్ శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాలో ఫస్ట్ సాంగ్ ను ఈరోజు రిలీజ్ చేసి టీజర్ ను రేపు రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. లవ్ అండ్ ఫామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.. సో రారండోయ్ హంగామా చేద్దాం అంటూ ఈ రోజు నుంచి సోషల్ మీడియా లో సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు చైతు…