సుకుమార్ ఇంటర్వ్యూ

Monday,April 02,2018 - 02:38 by Z_CLU

రామ్ చరణ్ ‘రంగస్థలం’ సూపర్ హిట్టయింది. టాలీవుడ్  ట్రెండ్ సెట్టర్ మూవీ అంటూ కాంప్లిమెంట్స్ అందుకుంటున్న ఈ సినిమా డైరెక్టర్ సుకుమార్, ఆ హ్యాప్పీనెస్ ని మీడియాతో షేర్ చేసుకున్నారు. ఆ స్పెషల్ చిట్ చాట్ మీకోసం…

ఆయన వల్లే ఈజీ అయింది…

సినిమాలో ప్రతి ఎలిమెంట్ 1980 లో ఎలా ఉండేది… అన్న పాయింట్ నుండే డిస్కషన్ బిగిన్ అయ్యేది. కానీ ఎప్పుడైతే ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ ఇన్వాల్వ్ అయ్యారో, ప్రతీది ఆయనే చేసుకున్నారు. ఆయన తరవాత కాస్ట్యూమ్స్ విషయంలో శాంతి, దీపాళి, ప్రతి పాయింట్ ని రీసర్చ్ చేసి కన్ఫర్మ్ చేసుకుని డెసిషన్ తీసుకున్నారు.

క్లైమాక్స్ ఇన్స్ పైర్ చేసింది…

ఈ సినిమా విషయంలో ఫస్ట్ మైండ్ లో తట్టింది క్లైమాక్స్. ఎప్పుడైతే క్లైమాక్స్ నచ్చేసిందో, దాని చుట్టూ స్టోరీ బిల్డ్ చేయడం బిగిన్ చేశాను. ఈ సినిమాకి ఇన్స్ పిరేషన్ కూడా క్లైమాక్సే…

 

ఆయన వల్లే…

నాకు తెలిసిన ఒకాయన.. ఎప్పుడూ సినిమాలు ఏ లండన్ లోనో, సిటీ బ్యాక్ డ్రాప్ లోనో తీస్తుంటావు… ఎందుకు మన సంస్కృతిని, మన గ్రామాలను హైలెట్ చేయవు అని అడిగారు, అప్పుడు డిసైడ్ అయ్యా.. ఇలాంటి సినిమా చేయాలని…

నా బ్యాంక్ లో ఉంది…

ఈ సినిమా చేయాలన్న ఆలోచన రాకముందు నుండే నా చిన్నప్పటి జ్ఞాపకాలు వెంబడిస్తూనే ఉన్నాయి. ఈ సినిమా చేయాలన్న ఆలోచన ఆలస్యంగా వచ్చిందేమో కానీ…  రంగస్థలం ఎప్పటి నుండో నా బ్యాంక్ లో ఉంది…

వాళ్లకు ఆ విషయం కూడా తెలీదు…

పాపికొండల దగ్గర షూటింగ్ చేశాం. అక్కడ జనాలు ఇంకా మారలేదు. అక్కడి ఊళ్లు ఇంకా డెవెలప్ కాలేదు. వాళ్లకు ఇప్పటికీ  డబ్బులు దాచుకోవడం కూడా తెలీదు. అయినా అక్కడ ఆడ మగా మధ్య సమానత్వం ఉంది. ప్రశాంతత ఉంది. వాళ్ళ అమాయకత్వం.. లైఫ్ స్టైల్ అద్భుతమనిపించింది.

క్లైమేట్ ఇన్స్ పైర్ చేసింది…

నేను రామ్ చరణ్ విషయంలో టైమ్ పడుతుంది అని మెంటల్ గా ఫిక్స్ అయి ఉన్నా.. ఎందుకంటే ఇప్పటి వరకు పల్లెటూళ్ళు చూడని వాడు, అలాంటి లైఫ్ స్టైల్ కనీసం అనుభవం కూడా లేని వాడు కాబట్టి, అట్లీస్ట్ ఒకరోజు పడుతుందని అనుకున్నా.. కానీ చెర్రీ ఫస్ట్ షాట్ లోనే పర్ఫెక్ట్ గా చేసేశాడు. ఆ విలేజ్ అట్మాస్ఫియర్ అంతలా ఇన్స్ పైర్ చేసింది…

 

నేనసలు నమ్మను….

ఒక సినిమా ఫెయిల్ అవ్వడానికి రీజన్స్ కథ  అవుతుంది. ఆ తరవాత  ఆ కథని దర్శకుడు సరిగ్గా చెప్పలేకపోవడం మరో రీజన్  అవుతుంది. ఒక స్టార్ హీరో చెవిటి వాడిలా నటించినందుకే ఫ్లాప్ అయింది, సైకిల్ తొక్కినందుకే ఫ్లాప్ అయింది లాంటి రీజన్స్ నేను ఆక్సెప్ట్ చేయను… సినిమా అంటేనే కథ…

20 నిమిషాల్లో…

సాధారణంగా ఒక సినిమా కథ రెడీ అవడానికి 6 నెలలు పడుతుంది. కానీ ఈ సినిమా కథ 20 నిమిషాల్లో అయిపోయింది. ఆ తర్వాత బెటర్ మెంట్, ఇంప్లిమెంట్ ఏం జరిగినా.. 20 నిమిషాల్లో పర్ఫెక్ట్ స్టోరీ స్కెల్టన్ వచ్చేసింది…

మెగాస్టార్ తో సినిమా…

ఇంకా కథ ఏమీ అనుకోలేదు… కానీ అవకాశం వస్తే మాత్రం తప్పకుండా చేస్తాను. ఆయన సినిమాలు చూసి ఇన్స్ పైర్ అయ్యాను. ఆయన సినిమాకు పని చేసే అవకాశం వస్తే, లైఫ్ టైమ్ దాహం తీరినట్టే…

డిలీటెడ్ సీన్స్…

రన్ టైమ్ ఎక్కువైందని సినిమాలో ఒక మంచి సీక్వెన్స్ తీసేశాం. సినిమాలో పృథ్వీ గారి క్యారెక్టర్ ఉంటుంది. ఆయన చుట్టూ కొన్ని కామెడీ సీక్వెన్సెస్ ఉన్నాయి, నిజాయితీగా కథ చెప్పాలి, ఎంత అద్భుతంగా ఉన్నా కథకి ఇవి అవసరం లేదు అనుకున్నప్పుడు ఉంచకూడదు అని డిసైడ్ అయి తీసేశాం… అలా తీసేస్తేనే సినిమా లెంత్ 2:50 దగ్గర ఆగింది. లేకపోతే 3 గంటలు దాటి ఉండేది.

రంగస్థలం 2 కి నేను రెడీ…

ఆర్య 2 కూడా అలాగే అనుకున్నా… కానీ చాలామంది టైటిల్ ఆర్యకి రిలేటెడ్ గా కాకుండా, వేరే పెట్టి ఉంటే బావుండేది అన్నారు. అందుకే రిస్క్ చేయకూడదు అనుకుంటున్నా. అయినా ప్రొడ్యూసర్స్ కి ఓకె అంటే రంగస్థలం 2 కి నేను రెడీ…

 

సీక్వెల్ కాదు…

రంగస్థలం 2 చేసినా, కంప్లీట్ గా డిఫెరెంట్ స్టోరీ ఉంటుంది. రంగస్థలం కి సీక్వెల్ అయి ఉండదు.

నవంబర్ లో చేయాలి…

నిజానికి ఈ సినిమా నవంబర్ లోనే సెట్స్ పైకి రావాలి. కానీ కరెక్షన్స్.. రీసర్చ్… లొకేషన్స్.. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకపోవడం వల్ల సినిమా లేట్ గా సెట్స్ పైకి వచ్చింది.

నెక్స్ట్ సినిమా…

ఇంకా ఏమీ అనుకోలేదు. నా బ్యానర్ లో నేను సినిమా చేయను. అంత రిస్క్ చేయను. నా బ్యానర్ లో వేరే డైరెక్టర్స్ తో  సినిమా ఉంటుంది.

చిరంజీవి నమ్మడం…

మేమందరం సినిమా చేయడం… నమ్మడం ఒక ఎత్తు. చిరంజీవి గారు కూడా ఈ సినిమాను నమ్మడంతో ధైర్యం వచ్చేసింది.

చరణ్ ఒక్కడే…

సినిమాకి చరణ్ ఒక్కడే హీరో…  సినిమాలో ఎంత మంది ఉన్నా ప్రతి ఒక్కరు చరణ్ హీరో అనుకున్నారు కాబట్టే… కథ అంతలా ఎలివేట్ అయింది.

 

సినిమాకి పెద్ద ప్లస్ అవే…

కథలో ఇంటర్నల్  పాయింట్స్ ఈ సినిమాకి పెద్ద కనెక్టింగ్ పాయింట్స్. గేదె పోతే వెదికే పద్ధతి దగ్గరినుండి ప్రతీది అప్పటి వాళ్ళ నమ్మకాలు తెలుసుకుని, రాసుకుని చేసినవే…

పాము కథ…

సినిమా చూస్తే రంగస్థలం కాని, మీరు జస్ట్ స్క్రిప్ట్ చదివితే అది రంగస్థలం కాదు. ఓ పాము కథలా ఉంటుంది…