రెండు భాగాలుగా ఎన్టీఆర్ బయోపిక్

Monday,April 02,2018 - 03:34 by Z_CLU

తేజ దర్శకత్వంలో గ్రాండ్ గా ప్రారంభమైంది ఎన్టీఆర్ బయోపిక్. రామకృష్ణ స్టుడియోస్ లో ప్రత్యేకంగా సెట్ వేసి మరీ ఈ సినిమాను లాంచ్ చేశారు. ఇప్పుడీ ప్రాజెక్టుకు సంబంధించి ఎక్స్ క్లూజివ్ మేటర్ బయటకొచ్చింది. ఎన్టీఆర్ బయోపిక్ ను రెండు భాగాలుగా తీయాలని నిర్ణయించారు.

నిజానికి ఈ ప్రాజెక్టును 2 పార్టులుగా తీయాలనే డిమాండ్స్ చాన్నాళ్లుగా వినిపిస్తున్నాయి. 3 గంటల సినిమాలో నటసార్వభౌముడ్ని పూర్తిగా ప్రొజెక్ట్ చేయలేరని చాలామంది వాదించారు. ఇప్పుడు అదే నిజమైంది. ఎన్టీఆర్ బయోపిక్ కు పార్ట్-2 కూడా రాబోతోంది.

పార్ట్-1ను ఎక్కడ ముగించాలనే అంశంపై ప్రస్తుతం చర్చలు జరుపుతున్నారు. ఇక పొలిటికల్ ఎలిమెంట్స్ అన్నీ పార్ట్-2లో ఉండే ఛాన్స్ ఉంది. బాలయ్య ఈ సినిమాలో దాదాపు 60 గెటప్స్ లో కనిపించబోతున్నాడు. ఇందులో ఓ కీలక పాత్రకు హీరో రాజశేఖర్ ను కూడా అనుకుంటున్నారట.